• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలవరం చీఫ్ ఇంజనీర్ బదిలీ.. జగన్ సంచలన నిర్ణయం... ఇందుకే !!

|

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎపీలోనే కాక కేంద్రం లో పెద్ద చర్చ జరుగుతున్న వేళ పోలవరం ప్రాజెక్ట్ చీఫ్‌ ఇంజినీర్‌ బదిలీ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం పనుల్లో అవకతవకలు జరిగాయని నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలతో రివర్స్ టెండరింగ్ కు వెళ్ళిన ఏపీ సర్కార్ కు అటు కోర్టు తీర్పు, ఇటు కేంద్రం సీరియస్ గా ఉండటం వంటి అంశాలు పెద్ద తలనొప్పిగా మారాయి.

బీజేపీలో అరవింద్ కు ఘోర అవమానం .. ఢిల్లీ పెద్దల ఆరా .. అసలేం జరిగింది

పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వర్ రావు బదిలీ .. ఆ స్థానంలో సుధాకర్ బాబు

పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వర్ రావు బదిలీ .. ఆ స్థానంలో సుధాకర్ బాబు

ఇక పోలవరం ప్రాజెక్టును తమ హయాంలో పూర్తి చెయ్యాలని సంకల్పించిన వైసీపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి విఘాతం కల్గించాయి. ఇక ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయం ఇంజనీరింగ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం వెంకటేశ్వరరావు రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉంటూనే పోలవరం చీఫ్‌ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరం చీఫ్ ఇంజనీర్ గా ఉన్న ఆయన మీద బదిలీ వేటు వేసిన జగన్ సర్కార్ ఆ స్థానంలో సుధాకర్ బాబును నియమించింది

15 ఏళ్లపాటు పోలవరం ప్రాజెక్టు కోసం పని చేసిన చీఫ్ ఇంజనీర్ .. బదిలీకి కారణం ఇదే

15 ఏళ్లపాటు పోలవరం ప్రాజెక్టు కోసం పని చేసిన చీఫ్ ఇంజనీర్ .. బదిలీకి కారణం ఇదే

15 ఏళ్లపాటు పోలవరం ప్రాజెక్టు కోసం నిరంతరం శ్రమించిన వెంకటేశ్వర రావును ప్రభుత్వం తప్పించడం ఇంజినీరింగ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ సహా నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో ఆయన పోలవరం కోసం పని చేశారు. ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం కేంద్రం నుంచి పరిహారం తీసుకురావడంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. అలాంటి చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు ను తప్పించటం వెనుక గల బలమైన కారణాలు ఏంటి అన్న ఆలోచనలో ఇంజనీరింగ్ వర్గాలు ఉన్నాయి. ఇటీవల పోలవరం పై పీపీఏ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఆయన పీపీఏలో సభ్యుడు కాబట్టి కేంద్రానికి ఇచ్చిన నివేదిక జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండటం కూడా ఒక కారణం అని తెలుస్తుంది. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించకుండా పీపీఏ నివేదికలో కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ నివేదిక ఇచ్చారు అన్న చర్చ సాగుతుంది. అంతే కాదు గత ప్రభుత్వ అవినీతిని బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో గత చంద్రబాబు హయాంలో పని చేసిన అధికారి చీఫ్ ఇంజనీర్ గా ఉంటె గత ప్రభుత్వ అవినీతి బయటకు తీసుకురావటం సాధ్యం కాదన్న భావన ఉన్నట్టు , అందుకే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చర్చ సాగుతుంది.

 వెంకటేశ్వరరావుకు పోలవరం అధారిటీ సభ్యత్వ రద్దు .. పీపీఏ సభ్యుడిగా సిఈ సుధాకర్ బాబు

వెంకటేశ్వరరావుకు పోలవరం అధారిటీ సభ్యత్వ రద్దు .. పీపీఏ సభ్యుడిగా సిఈ సుధాకర్ బాబు

వైసీపీ ప్రభుత్వం అనూహ్యంగా వెంకటేశ్వరరావును పోలవరం ప్రాజెక్టు బాధ్యతల నుంచి తప్పించి రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా కొనసాగించాలని ఆదేశించటం ,పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయటం వంటి నిర్ణయాలు తీసుకుంది. వెంకటేశ్వరరావు స్థానంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా సిఈ సుధాకర్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుధాకర్ బాబు ఇకపై పోలవరం చీఫ్ ఇంజనీర్ గా వ్యవహరించనున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Water Resources department has effected a rejig in the allotment of works of Polavaram irrigation project to engineers. Withdrawing works from the Engineer-in-Chief (ENC) of the project, the department allotted them to the Chief Engineer. The CE was also nominated to be a member of Polavaram Project Authority in place of the ENC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more