• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైసీపీకి రఘురామ అడగని సాయం-కేంద్రంతో లింక్ - ఏం జరిగినా మేలేజ్‌ ఖాయం

|

ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఏడాదిన్నరగా సొంత పార్టీపై పోరాటం చేస్తున్న రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌కు రోజుకో లేఖ రాస్తూ కంట్లో నలుసుగా మారిపోయారు. అంతటితో ఆగకుండా తనపై ఏపీ సీఐడీ రాజద్రోహం కేసు పెట్టడం, కస్టడీలో దాడి చేసిందంటూ జాతీయ స్ధాయిలో నేతలందరికీ లేఖలు రాస్తున్నారు. లోక్‌సభ స్పీకర్‌తో పాటు కేంద్రంలో పెద్దలకు కూడా ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు సొంత పార్టీని ఇరుకునపెట్టేందుకు అడగని సాయం చేసేందుకు సిద్దమయ్యారు. తద్వారా పార్టీ లైన్ దాటకుండానే ఇరుకునపెట్టే కొత్త వ్యూహానికి తెరలేపారు.

 మండలిపై వైసీపీ యూటర్న్‌

మండలిపై వైసీపీ యూటర్న్‌

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు అవసరమైన బిల్లుల్ని ఆమోదించలేదన్న కారణంతో శాసనమండలి రద్దుకు అసెంబ్లీలో వైసీపీ సర్కార్‌ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే అసెంబ్లీ ఏకపక్షంగా ఆమోదించుకున్న బిల్లులకు గవర్నర్‌ ముద్ర పడినా, కోర్టుల్లో మాత్రం ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మండలి రద్దు చేసీ ఉపయోగం లేదనే అంచనాకు వచ్చేసిన వైసీపీ ఇక యూటర్న్‌ తీసుకోవడమే మేలని భావించింది. దీంతో ప్రస్తుతం ఏకపక్షంగా శాసనమండలికి సభ్యుల్ని పంపుకునే అవకాశాన్ని వదులుకునేందుకు వైసీపీ ఇష్టపడటం లేదు. ఇలాంటి సమయంలో రెబెల్‌ ఎంపీ రఘురామరాజు ఈ వ్యవహారాన్ని కెలికారు.

 మండలి రద్దును కెలికిన రఘురామ

మండలి రద్దును కెలికిన రఘురామ

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై వైసీపీ సర్కార్‌ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్న రఘురామరాజు ఇప్పుడు శాసనమండలి రద్దును సైతం తెరపైకి తెచ్చారు. దీంతో ప్రభుత్వం కూడా స్పందించాల్సిన పరిస్ధితి ఎదురైంది. చివరికి దీనిపై స్పందించిన జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండలి రద్దుపై తమ స్టాండ్‌ మారలేదంటూనే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ఉద్దేశమేదీ లేదన్నారు. దీంతో సజ్జలకు ధ్యాంక్స్ చెప్పిన రఘురామ ఇకపై తాను కూడా మండలి రద్దు కోసం పార్లమెంటులో ప్రయత్నిస్తానంటూ సొంత పార్టీకి మరో షాకిచ్చారు.

 కేంద్రంతో రఘురామ లాబీయింగ్‌

కేంద్రంతో రఘురామ లాబీయింగ్‌

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేసి పంపినందున, దానికి అనుగుణంగా మండలి రద్దు కోసం పార్లెమంటులో ప్రయత్నిస్తానని రఘురామరాజు స్పష్టం చేశారు. త్వరలో పార్లమెంటులో స్పీకర్‌తో పాటు ఎంపీల్ని కలిసి మండలి రద్దు కోసం ప్రయత్నాలు చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ పెద్దల్ని సైతం కలిసి ఏపీ శాసన మండలి రద్దు కోరబోతున్నారు. ఎలాగో వైసీపీ ప్రభుత్వం చేసిన తీర్మానం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేయబోతున్నారు. తద్వారా వైసీపీపై ఒత్తిడి పెంచేందుకు రఘురామ సిద్దమవుతున్నారు.

 ఏం జరిగినా రఘురామకు మైలేజ్‌ ఖాయం ?

ఏం జరిగినా రఘురామకు మైలేజ్‌ ఖాయం ?

గతంలో ఏపీ అసెంబ్లీ.. శాసనమండలి రద్దు కోరుతూ చేసిన తీర్మానం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా ఈ తీర్మానంపై కేంద్రాన్ని ఒత్తిడి చేసింది లేదు. కానీ ఇప్పుడు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ తీర్మానంపై పార్లమెంటు వేదికగా రఘురామ చర్చకు పట్టుబట్టడమో, వాయిదా తీర్మానాలు ఇవ్వడమో, లేక చర్చ కోరడమో చేస్తే కేంద్రంతో పాటు వైసీపీ కూడా ఇరుకునపడటం ఖాయం. అలాంటి పరిస్ధితే వస్తే కేంద్రం గతంలో వైసీపీ సర్కారు నుంచి అందిన తీర్మానాన్ని తిరస్కరించడమో లేక అసెంబ్లీలోనే ఉపసంహరించుకోవాలని కోరడమో చేయొచ్చని తెలుస్తోంది. అంతిమంగా కేంద్రం ఈ వ్యవహారంతో తమకెలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకుంటే మాత్రం వైసీపీ సర్కార్‌ తీర్మానం ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏది జరిగినా తనకు మైలేజ్ దక్కడం ఖాయమని రఘురామ అంచనా వేస్తున్నారు.

English summary
ysrcp rebel mp raghurama krishnam raju offers unwanted help to own party in abolition of ap legislative council.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X