రాజశేఖర్ రెడ్డి పాలనను గుర్తు తెచ్చుకోండి..! జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వండన్నవిజయమ్మ!

ఇడుపులపాయ/హైదరాబాద్ : జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రజలను కోరారు. నేటి నుంచి ప్రచారానికి సిద్ధమైన విజయమ్మ ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. రాజశేఖరరెడ్డి పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. రాజశేఖరరెడ్డి పాలనను చూసి ఈ రోజు ఉన్న పాలను చూస్తే చాలా బాధగా ఉందని అన్నారు. జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండని కోరారు. తొమ్మిది సంవత్సరాలు నా బిడ్డ మీతో ఉన్నాడు మాతో కూడా లేడు అని తెలిపారు. జగన్ చేసిన పాదయాత్ర అయితేనేమీ ఓదార్పు యాత్ర అయితేనేమీ తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని విన్నాడు చూశాడు ఈ రోజు భరోసా ఇస్తున్నాడు.
రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా భరోసా ఇచ్చాడో జగన్ కూడా అదే విధంగా భరోసా ఇస్తాడని మీ అందరికీ నేను మాట ఇస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించాలని కోరారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టి జగన్కు ఒక్కసారి అవకాశమివ్వాలని కోరారు. ఈ ఐదేళ్లలో తానేం చేశానో చెప్పుకోలేని చంద్రబాబు.. జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.
రోజా పై నాగబాబు ఎందుకిలా : పవన్ మాత్రమే లక్ష్యమా : జబర్ధస్త్ ఎఫెక్ట్..!

ప్రజల్లో జగన్కు మంచి ఆదరణ ఉందని, జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. విజయమ్మ కందుకూరు, కనిగిరిలో, మార్కాపురంలో ప్రచారం నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బసచేసి శనివారం 10 గంటలకు యర్రగొండపాలెంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.