తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎర్రచందనం స్మగ్లర్ సోము రవిపై పిడి యాక్ట్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: శేషాచల కొండల నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తూ చిత్తూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో 23దాకా కేసులు నమోదై ఉన్న సోము రవి (39)పై పిడి యాక్ట్ నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా మంగళవారం తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతి ఏఎస్పీ త్రిమూర్తులు ఈ మేరకు వివరాలు తెలిపారు.

తమిళనాడు రాష్ట్రం వాసర్పాడి జిల్లా అన్నాసాలై శాస్ర్తీనగర్‌కు చెందిన సోము రవి గత కొన్నేళ్లుగా ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతున్నాడని తెలిపారు. జిల్లాలోని నిండ్ర, నగరి, సత్యవేడు, చిత్తూరు తాలూకా, చిత్తూరు టౌన్, భాకరపేట, జిడి నెల్లూరు, కార్వేటి నగరం, కాణిపాకం, వాయల్పాడు, రొంపిచెర్ల, పూతలపట్టు, మదనపల్లి పోలీస్టేషన్లతోపాటు ఇతర పోలీస్ స్టేషన్లలో కూడా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు.

నిందితుడు సోము రవి మరి కొంత మంది నిందితులతో కలసి ఎర్రచందనం దుంగలను చెన్నయ్‌కి తరలించి అక్కడ నుంచి కలకత్తా, బెంగళూరు, ముంబయ్, ఢిల్లీ, మణిపూర్‌లలోని తన అనుచరుల సహాయంతో విదేశాలకు తరలించి అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించాడన్నారు. వన సంపదకు నష్టం కలిగిస్తూ, ప్రభుత్వ ఆస్థికి గండి కొడుతూ, అడవుల్లోని జీవరాశి మనుగడకు ముప్పు కలిగించాడన్నారు.

అడ్డువచ్చిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులపై దాడిచేసి తప్పించుకుని పారిపోయేవాడన్నారు. సోము రవిని జనవరి 27న రేణిగుంట సిఐ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపర్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తిరుపతి సబ్‌జైల్లో ఉన్న సోము రవిలో ఎలాంటి మార్పు రాని కారణంగా తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జెట్టి పిడి యాక్ట్ నమోదుకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన ఆదేశాలతో సోము రవిని పిడి యాక్ట్ కింద అరెస్టు చేశామన్నారు.

అరెస్టు చేసిన నిందితుడిని భారీ పోలీస్ బందోబస్తు నడుమ కడప సెంట్రల్ జైలుకు తరలించారు. సమావేశంలో రేణిగుంట డిఎస్పీ నంజుండప్ప, టాస్క్ ఫోర్స్ డిఎస్పీ రవికుమార్‌మూర్తి పాల్గొన్నారు.

స్మగ్లర్ సోము రవిపై పిడి యాక్ట్

స్మగ్లర్ సోము రవిపై పిడి యాక్ట్

శేషాచల కొండల నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తూ చిత్తూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో 23దాకా కేసులు నమోదై ఉన్న సోము రవి (39)పై పిడి యాక్ట్ నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

స్మగ్లర్ సోము రవిపై పిడి యాక్ట్

స్మగ్లర్ సోము రవిపై పిడి యాక్ట్

ఈ సందర్భంగా మంగళవారం తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతి ఏఎస్పీ త్రిమూర్తులు ఈ మేరకు వివరాలు తెలిపారు.

స్మగ్లర్ సోము రవిపై పిడి యాక్ట్

స్మగ్లర్ సోము రవిపై పిడి యాక్ట్

తమిళనాడు రాష్ట్రం వాసర్పాడి జిల్లా అన్నాసాలై శాస్ర్తీనగర్‌కు చెందిన సోము రవి గత కొన్నేళ్లుగా ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతున్నాడని తెలిపారు.

స్మగ్లర్ సోము రవిపై పిడి యాక్ట్

స్మగ్లర్ సోము రవిపై పిడి యాక్ట్

జిల్లాలోని నిండ్ర, నగరి, సత్యవేడు, చిత్తూరు తాలూకా, చిత్తూరు టౌన్, భాకరపేట, జిడి నెల్లూరు, కార్వేటి నగరం, కాణిపాకం, వాయల్పాడు, రొంపిచెర్ల, పూతలపట్టు, మదనపల్లి పోలీస్టేషన్లతోపాటు ఇతర పోలీస్ స్టేషన్లలో కూడా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు.

English summary
In a major development, the Tirupati Urban police booked red sanders smuggler Ravi Somu of Chennai under the Preventive Detention Act on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X