వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్ర చందనం స్మగ్లర్లతో ఫైట్: అది హెరిటేజ్ వెహికిల్ కాదట...

ఎర్రచందనం స్మగ్లర్లు వాడింది హెరిటేజ్ వాహనం కాదట.. హెరిటేజ్ కంపెనీ లేబుల్‌ి తమ అక్రమ రవాణాకు అడ్డం పెట్టుకోవడానికి ప్రయత్నించినట్లు తేలింది.

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్లు వాడింది హెరిటేజ్ వాహనం కాదట.. హెరిటేజ్ కంపెనీ లేబుల్‌ి తమ అక్రమ రవాణాకు అడ్డం పెట్టుకోవడానికి ప్రయత్నించినట్లు తేలింది. హెరిటేజ్‌ పార్లర్‌ వ్యాన్‌లను పోలిన వాహనాలను ఎర్రచందనం స్మగ్లర్లు తయారు చేయించారని సమాచారం.

సంస్థకు ఉన్న బ్రాండ్‌ రీత్యానే కాకుండా పలుకుబడి రీత్యా కూడా ఆ వాహనాల్లో దుంగలను తరలించుకుపోతే ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతో స్మగ్లర్లు ఆ పనిచేసినట్లు తెలుస్తోంది. ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఐజీ కాంతారావు సారథ్యంలోని పోలీసులకు ఆ స్మగ్లర్లు చిక్కారు.

Red sanders smugglers used fake Heritage vehicle

పాల వ్యానులా ఉన్న వాహనంతోపాటు రూ.3 కోట్ల దుంగలను టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హెరిటేజ్‌ పాలవాహనంతో స్మగ్లింగ్‌ చేస్తే పట్టుకోరని స్మగ్లర్లు భావించారని కాంతారావు తిరుపతిలో మీడియాకు తెలిపారు. తిరుపతి గ్రాండ్‌వరల్డ్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం వేకువజామున టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూంబింగ్‌ జరుపుతున్నారని, ఈ సమయంలో వారికి వందమందికి పైగా ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డారని ఆయన చెప్పారు.

Recommended Video

పోలీసులపై స్మగ్లర్లు రాళ్లు రువ్వి దాడికి దిగారని, ఆత్మరక్షణ కోసం పోలీసులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారని, స్మగ్లర్లు దుంగలను అక్కడే వదిలేసి పారిపోయారని ఆయన చెప్పారు. ఘటన స్థలం నుంచి హెరిటేజ్‌ పార్లర్‌ పేరుతో ఉన్న నకిలీ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దాదాపు రూ.3 కోట్ల విలువైన 71 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనానికి తమిళనాడుకు చెందిన ఒరిజనల్‌ నెంబర్‌ప్లేట్‌పై ఏపీ స్టేట్‌ నెంబరు అంటించారు. అసలైన నెంబర్‌ను పరిశీలిస్తే తమిళనాడు గుమ్మిడిపూడికి చెందినట్టుగా తెలిసిందని కాంతారావు చెప్పారు.

English summary
Red sanders smugglers used fake Heritage lable vehicle to transport illegal red sanders at Tirupathi in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X