వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతి పేరులోనే సాధికారత, అంగుళం కూడా కదల్చలేరు, మడమ తిప్పి: టీడీపీ అనిత

|
Google Oneindia TeluguNews

అమరావతి రాజధానిని అంగుళం కూడా కదల్చలేరని టీడీపీ మహిళా నేత అనిత అన్నారు. అమరావతి పేరులోనే సాధికారత ఉందన్నారు. రాజధాని మార్పుపై రెఫరెండం ఛాలెంజ్ టు సేవ్ ఏపీ పోల్‌లో భాగంగా ఆమె ట్వీట్లు చేశారు. అధికార వైసీపీపై తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. పనిలోపనిగా సీఎం జగన్‌పైనా విమర్శలను ఎక్కుపెట్టారు.

ముగిసిన 48 గంటల డెడ్ లైన్.. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు సవాల్ డోంట్ కేర్ అన్న వైసీపీముగిసిన 48 గంటల డెడ్ లైన్.. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు సవాల్ డోంట్ కేర్ అన్న వైసీపీ

మాట మార్చి, మడమ తిప్పి...

మాట మార్చమని, మడమ తిప్పమని చెప్పే సీఎం జగన్ ఇష్టమొచ్చి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మదం ఎక్కి చేస్తున్న కామెంట్లను ఆ భగవంతుడు కూడా గమినిస్తున్నాడని అనిత తలిపారు. అంతేకాదు అందరినీ ఏడుకొండల వాడు చూసుకుంటాడని సెలవిచ్చారు. చంద్రబాబు విసిరిన ఛాలెంజ్ స్వీకరించలేనివారు పులి లాగా ఘీంకరించి.. పిల్లి లాగా ముడుచుకొని ఉన్నారని మండిపడ్డారు.

కుళ్లు, కుట్రలు చెల్లబోవు..

రాజధాని మార్పుపై అధికార పార్టీ కుట్రలు చెల్లబోవన్నారు. చివరికీ రైతుల త్యాగమే ఫలిస్తోందని అనిత చెప్పారు. 200కి పైగా రోజుల నుంచి రైతులు చేస్తోన్న నిరసనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నిజానికే న్యాయం మద్దతు ఇస్తోందని.. మరొ మొట్టికాయ ఖాయమని జగన్ సర్కార్‌పై ఓ రేంజ్‌లో అనిత విరుచుకుపడ్డారు.

Recommended Video

Amaravati భూముల పై Pawan Kalyan వీడియో వైరల్ | Amaravati Farmers || Oneindia Telugu

అవన్నీ ఇటుకలతో నిర్మించిన భవనాలు కాదా..?

అమరావతిలో ఒక్క ఇటుక వేశారా అని నెటిజన్ ప్రశ్నించగా.. అనిత కూడా అదే రేంజ్‌లో సమాధానం ఇచ్చారు. తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్న అసెంబ్లీ.. వాటిని తిప్పికొడుతున్న మండలి, సచివాలయం ఉన్నాయి కదా అని గుర్తుచేశారు. మీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులను రోజు ప్రశ్నిస్తోన్న హైకోర్టు లేవా అని అడిగారు. అవన్నీ ఇటుకల మీద నిర్మించిన భవనాలు కదా..? వాటిని నిర్మించింది చంద్రబాబు కదా అని ప్రశ్నించారు. వాటిపై చంద్రబాబు నాయుడు ముద్ర ఉండొద్దనే కదా మీ ప్రయత్నాలు అని ధ్వజమెత్తారు.

English summary
ReferendumChallengeToSaveAP: Can't move even an inch on amaravati capital city tdp woman leader anitha said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X