వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఆగస్ట్ 1నుండి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు .. కిటకిటలాడుతున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొంది. ఏపీ సర్కార్ ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతున్నట్టు చేసిన ప్రకటనతో ఇప్పడు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవటం కోసం భూములు, ఫ్లాట్ల కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఏపీలో కొన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే ఆఫీసుల్లో రద్దీ కనబడుతోంది.

నిమ్మగడ్డను కెలికిన కేశినేని నానీ ... జగన్ కు ఆ విషయంలో సవాల్నిమ్మగడ్డను కెలికిన కేశినేని నానీ ... జగన్ కు ఆ విషయంలో సవాల్

 ఏపీలో ఆగస్టు 01వ తేదీ నుంచి పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు అమలు

ఏపీలో ఆగస్టు 01వ తేదీ నుంచి పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు అమలు


ఏపీ సర్కార్ రిజిస్ట్రేషన్ చార్జీలను విపరీతంగా పెంచేసింది . ఆగస్టు 01వ తేదీ నుంచి పెరిగిన రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి రానున్నాయి . 5-10 శాతం మేర ఆస్తుల విలువలు పెరగనున్నాయి. గురువారం నుంచి పెరిగిన ధరల ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి రెండు సంవత్సరాలకు గ్రామీణ ప్రాంతాలు, ఏడాదికోసారి పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలును సవరిస్తుంటారు. కామన్‌గా 5 శాతం మాత్రమే పెంచుతుంటారు. ఈసారి మాత్రం..కొన్ని చోట్ల 5 శాతం, మరికొన్ని ప్రాంతాల్లో 10 శాతం చొప్పున భూముల విలువలు పెరిగాయి. కాబట్టి తదనుగుణంగా చార్జీలు పెంచనున్నారు.

భూముల ధరలు పెరగటమే కారణం .. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నేపధ్యంలో కిటకిటలాడుతున్న కార్యాలయాలు

భూముల ధరలు పెరగటమే కారణం .. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నేపధ్యంలో కిటకిటలాడుతున్న కార్యాలయాలు

రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లు చేసిన పెంపు ప్రతిపాదనలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్‌లు ఆమోదించినట్లు తెలుస్తోంది. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలు ఆగస్ట్ 1 నుండి పెరగనున్నాయి. అందుకే చాలలా మంది ముందుగానే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని భావిస్తున్నారు కొందరు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజుకు 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లు జరిగేవి కానీ ఇప్పుడా ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. భూముల, ఫ్లాట్ల రేట్లు పెరుగుతుండడమే ఇందుకు కారణమంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు అలాగే ఆర్ధిక రంగ నిపుణులు.

 మధ్యతరగతి మీద పెను భారంగా రిజిస్ట్రేషన్ చార్జీలు .. తగ్గించాలని ప్రభుత్వానికి వినతి

మధ్యతరగతి మీద పెను భారంగా రిజిస్ట్రేషన్ చార్జీలు .. తగ్గించాలని ప్రభుత్వానికి వినతి

ఉదాహరణకు రూ. 25 లక్షలున్న ఒక అపార్ట్ మెంట్ కొనుగోలు చేస్తే దానిపై స్టాంప్ డ్యూటీ 5 శాతం, ట్రాన్స్ ఫర్ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 1 శాతం మొత్తం 7.5 శాతం చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు . దీనికి GST అదనంగా చెల్లించాలి . ఈ లెక్కన చూస్తే రిజిస్ట్రేషన్‌కు చెల్లించాల్సిన ఫీజు లక్షా 87 వేల 500గా ఉంటుంది. ఇప్పటి పెంచిన ఛార్జీలు (5 శాతం అనుకొంటే) దీని ధర అమాంతం రూ. 26 లక్షల 25 వేలు అవుతుంది. ఇదే 10 శాతం పెరిగితే..రూ. 27 లక్షల 5 వేలు అవుతుంది. ఇది మధ్యతరగతి ప్రజలపై పెనుభారం అని పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలపై ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు. మధ్యతరగతి ప్రజలు ఇంత పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్ చార్జీలు భరించలేరని వారంటున్నారు.

English summary
AP government has increased registration fees tremendously. The increased registration prices will come into effect from August 1st. Property values ​​are expected to increase by 5-10%. Registration charges will be increased according to the increased prices . Land values ​​are revised every two years in rural and urban areas. Only 5% increase as a Common.This time, however, land values ​​increased by 5 per cent in some areas and by 10 per cent in some areas. So the charges will be increased accordingly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X