వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి ముఖేష్ అంబానీ భారీ విరాళం: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు లేఖ రాసిన జగన్

|
Google Oneindia TeluguNews

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోన్న పోరాటానికి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనవంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి అయిదు కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. దీనికి కృతజ్ఙతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యానికి లేఖ రాశారు.

Recommended Video

COVID-19 : Reliance Contributes Rs 5 Crore to Andhra Pradesh CM Relief Fund
 Reliance Industries donate Rs 5 Crore to Andhra Pradeshs Chief Ministers relief Fund

ఆన్‌లైన్‌ ద్వారా ఈ విరాళం మొత్తాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించింది. ఈ మొత్తం కరోనా నివారణ చర్యలకు వినియోగిస్తామని, దీన్ని నివారించడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు సహకరించడం కృతజ్ఙతలు తెలపుకొంటున్నట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. ముఖేష్ అంబానీ ఆప్తమిత్రడు, రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ఇప్పటికే తన మూడు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చినట్లు చెబుతున్నారు.

 Reliance Industries donate Rs 5 Crore to Andhra Pradeshs Chief Ministers relief Fund

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నివారణ చర్యల కోసం కొద్దిరోజుల కిందటే రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రధానమంత్రి సహాయనిధి పీఎం కేర్స్ఋకు 500 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు అయిదు కోట్ల రూపాయలను ముఖేష్ అంబానీ విరాళాన్ని అందజేసింది. ఇంతకుముందే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అయిదు కోట్ల రూపాయలను ప్రకటించింది.

ఎమిరేట్స్‌లో 30 లక్షల మంది భారత వలస కార్మికుల కోసం కేరళ సీఎం..ప్రధానికి లేఖఎమిరేట్స్‌లో 30 లక్షల మంది భారత వలస కార్మికుల కోసం కేరళ సీఎం..ప్రధానికి లేఖ

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ కరోనా వైరస్‌ను పారదోలే ప్రయత్నంలో ముందున్నాయి. ఈ క్రమంలో భారతదేశపు మొదటి 100 పడకల ప్రత్యేకమైన కోవిడ్ -19 హాస్పిటల్‌తో సహా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఆసుపత్రిని కోవిడ్ -19 రోగులను నిర్వహించడానికి కేవలం రెండు వారాల్లోనే సిద్ధం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉచిత భోజనం అందించేందుకు రంగంలోకి దిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఆ సంస్థ తరఫున రోజూ లక్ష మాస్కులను హెల్త్ వర్కర్లకు అందజేస్తున్నారు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ)లను సరఫరా చేస్తోంది.

English summary
Reliance Industries Chaired by Mukesh Ambani have donated the Rs 5 Crores to Andhra Pradesh's Chief Minisers's Relief Fund to fight covid-19 Coronavirus. Mukesh Ambani writes to Chief Minister YS Jagan Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X