• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీకి రిలయన్స్ గుడ్‌బై- 15 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు బ్రేక్- తిరుపతి భూములు వెనక్కి

|

ఏపీలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేయాలనుకున్న ఎలక్ట్రానిక్స్‌ తయారీ ప్లాంట్‌కు చుక్కెదురైంది. ఈ ప్లాంట్‌ ఏర్పాటు కోసం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న రిలయన్స్‌ సంస్ద స్ధానికంగా ఏర్పడిన భూవివాదాల నేపథ్యంలో వెనక్కితగ్గింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన రిలయన్స్.. గతంలో ఏపీఐఐసీ కేటాయించిన 136 ఎకరాల భూమిని సైతం తిరిగి ఇచ్చేసింది. దీంతో రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటవుతుందని భావించిన ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్‌ నిలిచిపోయినట్లయింది.

  Ys Jagan Govt చేసింది ఇదీ.. చేయబోతోంది ఇదీ | Ap Jobs Calendar 2021 || Oneindia Telugu
   రిలయన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్‌

  రిలయన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్‌

  తిరుపతిలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో సెట్‌టాప్‌ బాక్సులు, ఇంటర్నెట్‌ వినియోగానికి అవసరమైన డాంగిల్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో రిలయన్స్ ముందుకొచ్చింది. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం రిలయన్స్‌ సంస్థకు 136 ఎకరాలను కేటాయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాకే అందులో 75 ఎకరాలను అప్పగించింది. అయితే రిలయన్స్‌కు కేటాయించిన భూములకు సంబంధించిన 15 మంది రైతులు వివిధ కారణాలతో కోర్టులో కేసులు వేశారు.దీంతో వివాదం మొదలైంది.

  ఏపీకి రిలయన్స్‌ గుడ్‌బై

  ఏపీకి రిలయన్స్‌ గుడ్‌బై

  తిరుపతిలో ప్రభుత్వం భూమలు అప్పగించినా వివాదాలు మాత్రం రిలయన్స్‌ను వెంటాడాయి. ప్రస్తుతం ఆ భూములకు సంబంధించి సమారు 50 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. కేసులు పరిష్కారం అయ్యే వరకు యూనిట్‌ ఏర్పాటు చేయటానికి అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా వడమాలపేట మండలం పాడిరేడు అరణ్యం దగ్గర ఎలాంటి వివాదాలు లేని భూములను కేటాయిస్తామని ఏపీఐఐసీ అధికారులు ప్రతిపాదించారు. ఇదే విషయమై సంప్రదింపులు జరిపినా సంస్థ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు.

  ఇటీవల ఆ భూములనే తిరుమల దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయించిందిఈ నేపథ్యంలోనే సెట్‌టాప్‌ బాక్సుల అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను రిలయన్స్‌ సంస్థ విరమించుకుంది.

  ఏపీఐఐసీ భూములు వెనక్కి

  ఏపీఐఐసీ భూములు వెనక్కి

  తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ నిర్మించాలని భావించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అది కుదరకపోవడంతో ఏపీ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ) తమకు కేటాయించిన భూములను వెనక్కి ఇచ్చేసింది. రిలయన్స్‌ సంస్థ భూములను వెనక్కి ఇచ్చిన విషయాన్ని తిరుపతి ఏపీఐఐసీ జోనల్‌ కార్యాలయ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. దీంతో భూముల కోసం ఆ సంస్థ డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సంస్థ అవసరాల మేరకు సెట్‌టాప్‌ బాక్సుల తయారీకి ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమల శాఖ అధికారుల చర్చల సందర్భంగా... ఇప్పుడు రాష్ట్రంలో యూనిట్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు చెప్పినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు

   వైసీపీ సర్కార్‌కు భారీ ఎదురుదెబ్బ

  వైసీపీ సర్కార్‌కు భారీ ఎదురుదెబ్బ

  ఇప్పటికే విశాఖతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల గత ప్రభుత్వాల హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న పరిశ్రమలు తమ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో మూడు రాజధానుల అనిశ్చితి నేపథ్యంలో పారిశ్రామిక వర్గాలు వెనుకడుగు వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో దేశంలోనే పేరు ప్రఖ్యాతులున్న రిలయన్స్‌ సంస్ధ తమ పరిశ్రమను వెనక్కి తీసుకోవడం ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారింది. వైసీపీ నుంచి గెలిపించిన రాజ్యసభ ఎంపీ పరిమళ్‌ నత్వానీ సైతం ఈ విషయంలో ఏమీ చేసే పరిస్ధితి లేకపోవడంతో రిలయన్స్‌ ఏపీకి గుడ్‌బై చెప్పేసింది.

  English summary
  reliance industries has returned 136 acres of lands to ap govt alloted earlier for tirupati electronics hub.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X