నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి ఎమ్మెల్యే కాకానిని అరెస్ట్ చేయొద్దు: సుప్రీం కోర్టు ఆదేశాలు

వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణ వరకు కాకానిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణ వరకు కాకానిని అరెస్టు చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విదేశాలలో అక్రమ ఆస్తులు కూడబెట్టారని కాకాని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అతను తనపై తప్పుడు ఆరోపణలు చేశారని సోమిరెడ్డి శాసనమండలి ఛైర్మన్‌తో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

kakani govardhan reddy

సోమిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్‌ కోసం కాకాని నెల్లూరు జిల్లా సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషన్‌ను నెల్లూరు జిల్లా సెషన్స్‌ కోర్టు తోసిపుచ్చడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంలో ఆయనకు ఊరట లభించింది.

English summary
Relief to YSR Congress Party MLA Kakani Govardhan Reddy in Supreme Court on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X