వివేకా కేసులో సీబీఐకి ఊరట-తొలివేటు నిందితుడిపై క్లారిటీ-బెయిల్ రద్దు చేసిన కోర్టు
ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే హంతకుల్ని గుర్తించిన సీబీఐ.. ఇఫ్పుడు అసలు నిందితుల్ని గుర్తించే పనిలో ఉంది. అయితే ఇప్పటికే నిందితులుగా గుర్తించి అరెస్టు చేసిన వారు బెయిల్ కోసం పదే పదే కోర్టుల్నిఆశ్రయిస్తుండటంతో దర్యాప్తుపై ప్రభావం పడుతోంది. అదే సమయంలో సాక్ష్యులకు బెదిరింపులు కూడా పెరుగుతున్నాయి. దీంతో వివేకాపై తొలి వేటు వేశాడని భావిస్తున్న నిందితుడు ఉమాశంకర్ రెడ్డి బెయిల్ రద్దు కోసం సీబీఐ చేసిన వినతిని కడప కోర్టు అంగీకరించింది.

వివేకాపై తొలి వేటు నిందితుడు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యలో ఇప్పటివరకూ ఐదుగురు నిందితులు ప్రధాన పాత్ర పోషించినట్లు సీబీఐ గుర్తించింది. ఇందులో వివేకానందరెడ్డిపై గజ్జల ఉమాశంకర్ రెడ్డి గొడ్డలితో తొలి వేటు వేశాడని దర్యాప్తులో గుర్తించింది. మరో నలుగురు సహ నిందితులు ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్ తో కలిసి ఉమాశంకర్ రెడ్డి కుట్ర పన్నినట్లు ఛార్జిషీట్ లో ఇప్పటికే పేర్కొంది. ఇందులో వివకా హత్య సందర్భంగా దగ్గరుండి తతంగం అంతా నడిపించిన ఎర్ర గంగిరెడ్డికి కడప కోర్టు బెయిల్ ఇవ్వగా.. హైకోర్టు కూడా సమర్ధించింది. ఇప్పుడు ఇదే క్రమంలో మరో కీలక నిందితుడు ఉమాశంకర్ రెడ్డి కూడా బెయిల్ కోరాడు.

ఉమాశంకర్ రెడ్డి బెయిల్ ను వ్యతిరేకించిన సీబీఐ
వివేకా హత్య నిందితుల్లో ప్రధానంగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి బెయిల్ కోరుతూ కడప కోర్టును ఆశ్రయించాడు. దీంతో సీబీఐ ఈ బెయిల్ ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఉమాశంకర్ రెడ్డి వివేకాపై గొడ్డలితో తొలి వేటు వేశాడని ఇప్పటికే దర్యాప్తులో తేలిందని, హత్యకు ఉపయోగించిన ఆయుధాల్ని స్వాధీనం చేసుకుంటున్నామని, ఈ దశలో అతనికి బెయిల్ ఇస్తే సాక్ష్యుల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ అభ్యంతరం తెలిపింది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది.

బెయిల్ తోసిపుచ్చిన కోర్టు
వాచ్
మన్
రంగన్న,
అప్రూవర్
గా
మారిన
నిందితుడు
దస్తగిరి
ఇచ్చిన
వాంగ్మూలాల
ఆధారంగా
వివేకా
హత్యలో
ఉమాశంకర్
రెడ్డి
పాత్ర
కీలకంగా
ఉందని
సీబీఐ
వాదించింది.
వివేకాను
ఆయన
ఇంట్లోనే
ఎర్ర
గంగిరెడ్డి,
సునీల్
యాదవ్,
దస్తగిరి,
ఉమాశంకర్
రెడ్డి
కలిసి
హత్య
చేశారని,
వివేకాపై
గొడ్డలి
వేట్లు
వేసింది
కూడా
ఆయనేనని
సీబీఐ
దర్యాప్తులో
తేలినట్లు
వివరించింది.
హత్య
తర్వాత
ఉమాశంకర్
రెడ్డి
పారిపోతున్న
దృశ్యాలు
కూడా
సీసీటీవీలో
రికార్డు
అయ్యాయని
తెలిపింది.
ఇప్పటికే
కడప
కోర్టు
రెండుసార్లు,
హైకోర్టు
ఓసారి
అతని
బెయిల్
పిటిషన్లను
కొట్టేసిందని
సీబీఐ
తెలిపింది.
దీంతో
సీబీఐ
వాదనలతో
ఏకీభవించిన
కడప
కోర్టు..
ఉమాశంకర్
రెడ్డి
బెయిల్
ను
తోసిపుచ్చింది.


అసలు నిందితుల కోసం నార్కో టెస్టులు ?
వివేకా కేసులో ఇప్పటికే హత్యకు పాల్పడిన నిందితుల్ని సీబీఐ గుర్తించింది. కానీ వారి వెనుక ఉన్న అసలు నిందితుల్ని మాత్రం గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే హంతకులుగా భావిస్తున్న నిందితులకు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో కీలక నిందితుడు ఉమాశంకర్ రెడ్డికి నార్కో పరీక్షల కోసం పులివెందుల కోర్టులో పిటిషన్ వేయగా అతను వ్యతిరేకించాడు. ఇప్పుడు మిగతా నిందితులకు కూడా నార్కో టెస్టుల కోసం సీబీఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఏ ఒక్క నిందితుడికి నార్కో పరీక్షలు చేయగలిగినా అసలు నిందితులు తెలిసే అవకాశం ఉందని సీబీఐ భావిస్తోంది.