వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సానియాపై వ్యాఖ్యలు: మీడియాపై కిషన్ రెడ్డి నింద

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై తమ పార్టీ శాసనసభ్యుడు కె. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సమర్థించడానికి ప్రయత్నించారు. సానియాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై తమ శాసనసభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పారు.

లక్ష్మణ్ వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు. మీడియా లక్ష్మణ్ వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆయన అన్నారు. విద్యార్థుల స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వైఖరిని తప్పు పట్టడానికి సానియా నియామకాన్ని ప్రస్తావించారని ఆయన వివరణ ఇచ్చారు.

Remarks on Sania Mirza only to argue the case of students: Kishan Reddy

సానియా తల్లిదండ్రులు 1956 తర్వాత ఇక్కడ స్థిరపడ్డారని, 1956కు ముందు స్థిరపడిన విద్యార్థులకే ఫీజు రీయంబర్స్‌మెంట్ ఉంటుందని తెలంగామ ప్రభుత్వం అనడం సరికాదని చెప్పడానికి తమ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారని ఆయన వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం 10, 15 ఏళ్ల క్రితం స్థిరపడిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిరాకరిస్తూ పాకిస్తానీయుడిని పెళ్లాడిన సానియాకు అంబాసిడర్ హోదాను కట్టబెట్టిందని అన్నారు.

English summary
Telangana BJP president G Kishan Reddy on Friday tried to defend his party MLA's controversial remarks about Sania Mirza, saying he was not opposing her being made the state's brand ambassador but was only arguing for students who have been denied scholarships as their parents settled in the region after 1956.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X