• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాష్ట్రపతితో జరిగే సదస్సులో చర్చించండి : గవర్నర్లకు రఘురామ లేఖలు.. సీఎం జగన్ పైనే : వైసీపీ మౌనం వెనుక..!!

By Lekhaka
|

వైసీపీ రెబల్ ఎంపీ వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు..ఎంపీలు..ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన రఘురామ తాజాగా గవర్నర్లకు సైతం లేఖలు పంపారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు..ప్రభుత్వ పధకాల్లో లోపాలను ప్రస్తావించినందుకే తన పైన సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని గవర్నర్లకు రాసిన లేఖలో రఘురామ రాజు ఫిర్యాదు చేసారు. అధికారంలో ఉన్న వారికి ప్రజా సమస్యలు అర్దం అయ్యేలా చేస్తే..ముఖ్యమంత్రి తన పైన వ్యక్తిగత కక్ష్య పెంచుకొని అక్రమ కేసులు బనాయించేలా వ్యవహరించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీ సీఐడి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి తనను అరెస్ట్ చేసిన విధానాన్ని లేఖలో వివరించారు.

  Narsapuram Mp కేసులో ట్విస్ట్, HRC సీరియస్..!!

  గవర్నర్లకు రఘురామ లేఖ

  హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తననున గుంటూరు తరలించారని..అదే రోజు సీఐడీ కార్యాలయంలో తనను హింసించారని గవర్నర్లకు రాసిన లేఖలో చెప్పుకొచ్చారు. సీఐడీ ఉన్నతాధికారులు..ఐదుగురు వ్యక్తులు లాఠీలు, రబ్బరు బెల్టులతో తనను చిత్రహింసలకు గురి చేశారంటూ ఆ లేఖల ద్వారా గవర్నర్లకు వివరించారు.

  సిట్టింగ్ ఎంపీ పైన దేశ ద్రోహం కేసు నమోదు చేయటం..హింసించటం దేశ చరిత్రలోనే ఇది తొలి సారంటూ ఎంపీ గవర్నర్ల దృష్టికి తీసుకువచ్చారు. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రపతికి నివేదించినట్లుగా లేఖలో పేర్కొన్నారు. త్వరలోరాష్ట్రపతి అధ్యక్షతన జరిగే సదస్సులో గవర్నర్లు ఈ అంశాన్ని ప్రస్తావించాలని రఘురామ కోరారు. తనకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో సీఐడి రఘురామ ఫోన్ విషయంలో చేసిన ఆరోపణలను ఖండించింది.

   వైసీపీ నేతల మౌనం వెనక

  వైసీపీ నేతల మౌనం వెనక

  మొత్తం జరిగిన వ్యవహారాన్ని సుప్రీం కు నివేదించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక, రాజకీయంగానూ ఈ అంశం పైన వైసీపీలో అంతర్గతంగా ముఖ్యుల మధ్య మాత్రమే చర్చ సాగుతోంది. రఘురామ రాజు వరుసగా లేఖలు రాస్తున్నా..కొందరు ఎంపీలు ఆయనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినా..వైసీపీ నేతలు మౌనం పాటిస్తున్నారు. ఏపీలో సైతం రఘురామ చర్యల పైన ఏ వైసీపీ నేత నోరు విప్పటం లేదు. వైసీపీ కొందరు ముఖ్య నేతలు ఢిల్లీ కేంద్రంగా రఘురామ రాజుకు కౌంటర్ గా పావులు కదిపే వ్యూహం అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

  ఎలాగైనా రఘురామ మీద ముందుగా అనర్హత వేటు పడాలనేది వైసీపీ నేతల వ్యూహంగా తెలుస్తోంది. ఇక, ముఖ్యమంత్రి జగన్ సైతం రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఆ సమయంలో రాజ్ నాధ్ తో పాటుగా అమిత్ షా తోనూ సీఎం సమావేశం అవుతారని చెబుతున్నారు. అప్పుడు సీఎం తమ ఎంపీ రఘురామ విషయం పైనా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

   సీఐడీ ఏం చేయబోతోంది..?

  సీఐడీ ఏం చేయబోతోంది..?

  ఇక, సీఐడీ వేయబోయే తరువాతి అడుగులు సైతం ఆసక్తి కరంగా మారుతున్నాయి. సీఐడీ లక్ష్యంగా రఘురామ రాజు కేసులు పెట్టటం..లేఖలు రాయటం ద్వారా అటు ఏపీ ప్రభుత్వాన్ని..ఇటు ఏపీ సీఐడీని భారీగా డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సీఐడీ ఆయన ఆరోపణల పైన వివరణ ఇచ్చింది. కానీ, విచారణ లో నెక్స్ట్ స్టెప్ కీలకంగా మారనుంది. వైసీపీ నేతలు మౌనంగా లేరని..ఇదంతా వ్యూహాత్మక మౌనంగా చూడాలని పార్టీ నేతలు అంటున్నారు. దీంతో..రానున్న రోజుల్లో రఘురామ విషయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

  English summary
  MP Raghu Rama Raju writes letters to all Governors on AP Govt harasment and repeal of section 124A.He complaints of Cm Jagan and AP Cid and requested governors to discuss this issue in President meeting.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X