గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియా ప్రతినిధి కాదా అని ఇంటికి రానిస్తే .. ఆయన భార్యకే లైన్ వేసి.. కాపురం కూల్చేశాడు ?

|
Google Oneindia TeluguNews

గుంటూరు : మీడియా ప్రతినిధి అని ఆ పోలీసు అధికారి చనువిచ్చాడు. ఇంటికి తీసుకెళ్లాడు. అంతేకాదు తనకు ఓ అపార్ట్ మెంట్ కొనుగోలు విషయంలో సహరించడంతో వారి మధ్య సన్నిహిత్యం ఏర్పడింది. కానీ ఆ వక్రబుద్ధి రిపోర్టర్ బుద్ధి .. పోలీసు అధికారి భార్యపై కన్నుపడింది. ఇంకేముంది ఆమెను లైన్ లో పెట్టి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసినా .. పోలీసు అధికారి విశ్వసించలేదు. ఇటీవల క్యాంప్ కు వెళ్లి ఇంటికొస్తే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో .. తన కాపురాన్నే కూల్చివేశాడని ఆ పోలీసు అధికారి తల పట్టుకున్నాడు.

సాన్నిహిత్యంగా మారిన పరిచయం

సాన్నిహిత్యంగా మారిన పరిచయం

అమరావతి రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న పోలీసు అధికారి .. గతంలో తెనాలిలో పనిచేసేవారు. ఆ సమయంలో సిటీకేబుల్ కార్యాలయంలో పనిచేస్తున్న సదరు ప్రతినిధి పోలీసు అధికారికి పరిచయమయ్యారు. తర్వాత సిటీకేబుల్ నుంచి శాటిలైట్ చానెల్ కు మారిన ప్రతినిధి .. గుంటూరులోని దేవాపురంలో అపార్ట్ మెంట్ కొనుగోలు చేసే విషయంలో అధికారికి సహకరించారు. ఆ తర్వాత పోలీసు అధికారి భార్యతో సన్నిహిత్యం పెరిగింది. ఆయన క్యాంపులకు వెళ్లిన సమయంలో వివాహేతర సంబంధం కొనసాగించాడు. విషయం తెలిసిన పోలీసు అధికారి .. పద్ధతి మార్చుకోవాలని చెప్పినా మీడియా ప్రతినిధి వినలేదు.

క్యాంపునకు వెళితే ..

క్యాంపునకు వెళితే ..

ఈ క్రమంలో మార్చి 13న నరసరావుపేట క్యాంపునకు వెళ్లారు పోలీస్ అధికారి. తిరిగి వచ్చి తలుపుకొట్టగా ఆయన భార్య తడబాటునకు గురైంది. అనుమానం వచ్చి బెడ్ రూం బాత్ రూం తలుపుపట్టగా .. మీడియా ప్రతినిధి బయటకొచ్చాడు. అంతేకాదు పోలీసు అధికారిపై చేయిచేసుకునే ప్రయత్నం చేశాడు. వీరి భండారాన్ని బయటపెట్టాలని బయటకు తీసుకురాగా .. వారిద్దరూ మళ్లీ లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో పోలీసు అధికారి అరవగా .. ప్రియుడుతో కలిసి వివాహిత కారులో పారిపోయింది.

భార్యభర్త, ఇద్దరు పిల్లలు : మధ్యలో మీడియా ప్రతినిధి

భార్యభర్త, ఇద్దరు పిల్లలు : మధ్యలో మీడియా ప్రతినిధి

పోలీసు అధికారి దంపతులకు ఇంజినీరింగ్ చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాపురంలో కలహాలు వచ్చి వీడిపోవడానికి మీడియా ప్రతినిధి కారణమయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువుపోతోందని మదనపడి .. చివరికి గతనెల 27న పట్టాభిపురం పీఎస్ లో కంప్లైంట్ చేశాడు. పోలీసు అధికారి ఫిర్యాదు చేసినా .. ఆ స్టేషన్ అధికారులు స్పందించలేదంటే మీడియా ప్రతినిధి లాబీయింగ్ ఎంత పనిచేసిందో తెలుస్తోంది. తర్వాత అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో .. ఖాకీలు కూడా విని ఫిర్యాదు తీసుకున్నారు.

ఇంటికి రానిస్తే కాపురాన్నే కూల్చేశాడు

ఇంటికి రానిస్తే కాపురాన్నే కూల్చేశాడు

తన కాపురంలో మీడియా ప్రతినిధి రేపిన చిచ్చుతో .. ఇంటికి కూడా వెళ్లడం లేదు. అంతా చేసినా ఆ వివాహిత తన కాపురాన్ని నిలబెట్టాలని అర్బన్ ఎస్పీని ఆశ్రయించారు. దీంతో ట్రాఫిక్ డీఎస్పీ సుప్రజ .. దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి కౌన్సిలింగ్ ఇస్తామని డీఎస్పీ చెప్తున్నారు. మొత్తానికి స్నేహితుడని నమ్మి ఇంటికి రానిస్తే .. పోలీసు అధికారి కాపురంలోనే చిచ్చుపెట్టాడు మీడియా ప్రతినిధి.

English summary
In ap one media reporter spoil police officer family disturb. he illegal affair with police officer. one fine day police officer know, hes wife illegal affair .. after that he warned those people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X