వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ వదంతులు నమ్మవద్దు.. అందులో నిజం లేదు.. గ్యాస్ లీకేజీ ఘటనపై పోలీస్ శాఖ

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం జిల్లా ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో రెండోసారి గ్యాస్‌ లీకైనట్టుగా వచ్చిన వార్తలను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఖండించారు. అందులో నిజం లేదని.. ఆ వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో టెక్నికల్ టీమ్ మరమ్మత్తులు చేస్తోందని.. ఈ క్రమంలో కొంత ఆవిరి బయటకు వచ్చిందని అన్నారు. ఈ మేరకు ఏపీ పోలీస్ ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టతినిచ్చారు.

మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా రెండోసారి గ్యాస్ లీకైందన్న వార్తలను కొట్టిపారేశారు. కంపెనీలో గ్యాస్‌ లీక్‌ పూర్తిగా అదుపులోకి వచ్చిందన్నారు. ఆర్‌ఆర్‌ వెంకటాపురం, బీసీ కాలనీల్లోని ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించి వేరే చోట ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించామన్నారు. వారికి భోజనం సహా ఇతరత్రా సదుపాయాలన్నీ అక్కడే కల్పిస్తామన్నారు. ఎల్‌జీ పాలిమర్స్ ఘటనతో విశాఖ వాసులు భయాందోళనకు గురికావద్దని అన్నారు.

కాగా,గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనతో విశాఖ ఉలిక్కిపడింది. సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురం,బీసీ కాలనీ,ఎస్సీ కాలనీల ప్రజలకు ఏం జరుగుతుందో అంతుచిక్కలేదు. గ్యాస్ కారణంగా కళ్లు మంటలు,చర్మంపై దద్దుర్లు వచ్చాయి. అక్కడినుంచి బయటపడాలని పరిగెత్తేలోపు అపస్మారక స్థితికి చేరుకుని కుప్పకూలిపోయారు.

 reports of second gas leakage at lg polymer plant are false says police

Recommended Video

Petrol Bunk Employees In Visakhapatnam Playing Cricket During Lockdown!

వేగంగా స్పందించిన అధికార యంత్రాంగం 300 పైచిలుకు మందిని ఆసుపత్రులకు తరలించింది. ఇందులో 80మందికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖలోని కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదుకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు.

English summary
Andhra Pradesh Poilce officials made it clear that there is no second leakage in the plant. They appealed people not to believe in those rumours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X