విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖపట్నం కాదు..విజయవాడే: ఈ ఒక్కసారి ఇక్కడే: అచ్చొచ్చిన స్టేడియం..!

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన తరువాత జగన్ సర్కార్.. విశాఖపట్నానికి ఫస్ట్ షాక్ ఇచ్చింది. ఈ తీర ప్రాంత నగరంలోనే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని తొలుత తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ సారి విజయవాడలోనే ఈ వేడుకలను నిర్వహించాలని సూచనప్రాయంగా నిర్ణయించింది.

విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలోనే ఈ సారి గణతంత్ర దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఈ ఏడాది విశాఖపట్నంలో గణతంత్ర దినోత్సవాలను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేశారు అక్కడి అధికారులు. రామకృష్ణా బీచ్ రోడ్డులో కొద్దిరోజులుగా రిహార్సల్స్ కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

 Republic Day Celebrations to be held in Vijayawada not in Visakhapatnam

ఈ పరిస్థితుల్లో..రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఏడాది విజయవాడలోనే గణతంత్ర దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో గణతంత్ర దినోత్సవాలను నిర్వహించకపోవడానికి పెద్దగా సాంకేతిక పరమైన, భద్రతాపరమైన కారణాలేవీ లేవని అధికారులు చెబుతున్నారు. తగినంత సమయం, నివాస వసతి వంటి సౌకర్యాలు లేకపోవడం కూడా ఓ కారణమని తెలుస్తోంది.

విశాఖలో ఈ వేడుకలను నిర్వహించాల్సి వస్తే.. ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు యంత్రాంగం, ఇతర సిబ్బంది.. వారంతా అక్కడ నివసించడానికి ఏర్పాట్లు లేవని తెలుస్తోంది. ఒక్కపూటలో వెళ్లి రావాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అధికారులు చెబుతున్నారు. దీనికంటే విజయవాడలోనే ఈ ఏడాదికి గణతంత్ర దినోత్సవాలను నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతోందని అంటున్నారు.

English summary
The YSRCP government headed by chief minister Jagan Mohan Reddy, which had earlier decided to hold the Republic day celebrations in Visakhapatnam has now backed down and said to be holding Republic Day events in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X