వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతిని వేధించిన కేసులో రిజర్వ్ ఎస్ ఐ అరెస్టు

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఓ యువతిని రిజర్వ్ ఎ స్ ఐ వేధిస్తున్నాడు. ఆ యువతి వేధింపులపై యువతి ఫిర్యాదు మేరకు రిజర్వ్ ఎస్ ఐ పోలీసులు అరెస్టు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఓ యువతిని రిజర్వ్ ఎ స్ ఐ వేధిస్తున్నాడు. ఆ యువతి వేధింపులపై యువతి ఫిర్యాదు మేరకు రిజర్వ్ ఎస్ ఐ పోలీసులు అరెస్టు చేశారు.

విశాఖ పట్టణంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కప్పరాడ రాంజీ ఎస్టేట్ లో ఓ యువతి నివాసం ఉంటుంది. ఆమె డాబా గార్డెన్స్ లో ని దుకాణంలో పనిచేస్తోంది. ఆమె స్నేహితురాలు ఆచూకీ వారం రోజులుగా కన్పించడం లేదు.

అయితే ఈ కేసు విషయమై రిజర్వ్ ఎస్ ఐ ఆ యువతిని వేధిస్తున్నాడు. బుదవారం రాత్రి పూట యువతికి ఫోన్ చేసి నీ స్నేహితురాలు చనిపోయింది. ఆమె చనిపోవడానికి నీ ప్రమేయముందంటూ ఆమెను భయపెట్టాడు. ఎక్కడ ఉంటున్నావో చెప్పాలంటూ నిలదీశాడు.

reserve si arrested by vizag police

దీంతో ఆమె భయపడిపోయింది. తాను ఎక్కడ ఉన్నానో ఆ యువతి చెప్పింది. దీంతో ఆ యువతి ఉన్న ప్రదేశానికి వచ్చిన ప్రసాద్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.దీంతో ఆ యువతి రిజర్వ్ ఎస్ ఐ ను తప్పించుకొని వచ్చిన యువతి స్థానికుల సహయంతో కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు ఆధారంగా రిజర్వ్ ఎస్ ఐ ప్రసాద్ ను అదుపులోకి తీసుకొన్నారు పోలీసులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ ప్రస్తుతం విజయవాడలో రిజర్వ్ ఎస్ ఐ గా పనిచేస్తున్నాడు.

English summary
reserve si arrested by vizag police on Wednesday, prasad working as a reserve si in Vijayawada, he harassed a lady in vizag, police arrested prasad on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X