వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ ఎన్నికల తర్వాత వైసీపీలో ప్రక్షాళన ? ప్రభుత్వంలోనూ మార్పులకు జగన్ సై..

|
Google Oneindia TeluguNews

ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వంలో రాజ్యసభ ఎన్నికల తర్వాత ప్రక్షాళన చేపట్టాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులో భాగంగా పలువురు మంత్రులకు ఉద్వాసన పలకడం, మరికొందరికి శాఖలు మార్చడం, అదే విధంగా వైసీపీలోనూ కీలక మార్పులు చేయాలనేది జగన్ ఉద్దేశంగా కనిపిస్తోంది. సీఎంవోలోనూ పలువురు అధికారులు, సలహాదారులకూ స్ధాన చలనం, ఉద్వాసనలు తప్పదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 పది నెలల వైసీపీ పాలన- తాజా పరిస్ధితి

పది నెలల వైసీపీ పాలన- తాజా పరిస్ధితి

ఏపీలో వైసీపీ అధికారం చేపట్టి ఈ నెలాఖరుకు పదినెలలు పూర్తి కాబోతోంది. ఈ పది నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. అంతకు మించి సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చింది. అయితే వీటిపై ప్రజల్లో మాత్రం అనుకున్న స్ధాయిలో మైలేజ్ తెచ్చుకోలేకపోయింది. దీనికి కారణం ఏపీలో టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాతో పాటు వారు జనాల్లో వ్యాప్తి చేస్తున్న భావజాలమే. ప్రధానంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా జగన్ పై వ్యతిరేకతను మీడియా, విపక్షాలు చాటుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ వ్యతిరేకతను తట్టుకుంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న జగన్ కు అధికార యంత్రాంగం, మంత్రివర్గం నుంచి తగిన సహకారం లభించడం లేదనే భావన నెలకొంది.

ప్రక్షాళనకు జగన్ సంకేతాలు...

ప్రక్షాళనకు జగన్ సంకేతాలు...

ఏపీలో ప్రభుత్వం అధికారం చేపట్టి పదినెలలు పూర్తవుతున్నా ప్రజల్లో పూర్తి సానుకూలత తెచ్చుకోవడంలో విఫలం కావడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు జగన్ కు అంతర్గత సర్వేల ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా పార్టీకీ, ప్రభుత్వానికి మధ్య సమన్వయం సాధించడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులు, సీనియర్ అధికారుల వైఫల్యం ఉన్నట్లు జగన్ గ్రహిస్తున్నారు. వీటితో పాటు మీడియా, న్యాయ విభాగాల్లో పలువురు సీనియర్లు, సలహాదారులు ఉన్నప్పటికీ వారు సంతృప్తికర స్ధాయిలో ఫలితాలు రాబట్టలేకపోతున్నారని జగన్ భావిస్తున్నారు. సీఎంవోలో ఉన్న అధికారుల తీరు కూడా పలు సందర్భాల్లో వివాదాలకు కారణమవుతున్న అంశంపైనా జగన్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో సమగ్ర ప్రక్షాళన చేపట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 ప్రభుత్వం నుంచే ప్రక్షాళన మొదలు..

ప్రభుత్వం నుంచే ప్రక్షాళన మొదలు..

ప్రభుత్వం అధికారం చేపట్టాక తీసుకున్న కీలక నిర్ణయాల్లో రాజధాని మార్పుతో పాటు పలు అంశాలు ఉన్నాయి. నవరత్నాల అమలును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాల వ్యవస్దను తీసుకొచ్చినా ఇప్పటికీ అది బాలారిష్టాలను దాటలేదు. దీంతో ప్రభుత్వ ఉద్దేశం నెరవేరడం లేదు. మూడు రాజధానుల వ్యవహారంతో పాటు స్ధానిక ఎన్నికల సందర్బంగా కూడా తనకు అత్యంత విశ్వసనీయంగా ఉన్న అధికారులు కొందరు వాస్తవ పరిస్ధితిని తన దృష్టికి తీసుకురాలేదని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపు విషయంలోనూ సీఎంవోలో అధికారుల మధ్య సమన్వయం లోపించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం సచివాలయానికి రావడం లేదనే కారణంతో జగన్ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికార వ్యవస్ధలో బదిలీలతో పాటు సమగ్ర ప్రక్షాళన చేపట్టాలని జగన్ భావిస్తున్నారు. ఇదంతా విశాఖకు వెళ్లకముందే జరగాలనేది జగన్ ఉద్దేశంగా కనిపిస్తోంది.

కేబినెట్ లోనూ ప్రక్షాళన...

కేబినెట్ లోనూ ప్రక్షాళన...

వైసీపీ అధికారం చేపట్టాక మంత్రులను తీసుకునే సందర్భంలోనే జగన్ వారికి చాలా పరిమితులు విధించారు. ముఖ్యంగా వారి పదవీకాలం రెండున్నరేళ్లే అని, ఆ మధ్యలో ఆరోపణలు ఎదురైనా, అవినీతికి పాల్పడినా ఉద్వాసన తప్పదని స్పష్టంగా చెప్పారు. కానీ ప్రస్తుత కేబినెట్ మంత్రులపై వివిద స్ధాయిల్లో వస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా జగన్ సేకరిస్తున్నారు. కొన్ని నెలలుగా పలు సందర్భాల్లో సదరు మంత్రులకు హెచ్చరికలు కూడా చేశారు. అయినా మార్పు రాలేదని భావిస్తున్న జగన్ రాజ్యసభ ఎన్నికల తర్వాత జరిగే ప్రక్షాళనలో వీరికి ఉద్వాసన పలకాలనే నిర్ణయాని వచ్చినట్లు తెలుస్తోంది. వీరి స్ధానాల్లో ఎవరెవరిని తీసుకోవాలనే క్లారిటీ వస్తే ప్రక్షాళనకు ముహుర్తం ఖరారు చేయొచ్చని ఆయన భావిస్తున్నారు.

ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం..

ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం..


వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటివరకూ అన్నీతానై నడిపిస్తున్న జగన్, త్వరలో ఇందుకోసం ప్రత్యేక కమిటీ లేదా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్లుగా ఉన్న వారితో పాటు ప్రభుత్వంలోని మంత్రులు, సలహాదారులను ఇందులో భాగస్వాములను చేయొచ్చని చెబుతున్నారు. మొత్తం మీద విశాఖ రాజధానికి వెళ్లకముందే ఈ ప్రక్షాళన పూర్తి చేయాలనే ఉద్దేశంలో జగన్ ఉన్నట్లు తాజాగా ఆయన్ను కలిసిన కొందరితో మాట్లాడినప్పుడు తెలిసింది.

English summary
andhra cm and ysrcp chief ys jagan plans to reshuffle his cabinet and party after rajya sabha elections on march 26th. cm jagan mulling over co-ordination between party and govt. in a wake of capital shifting to visakhapatnam jagan want to do key changes in govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X