అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరండి : సవాల్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆందోళనల బాట పట్టింది.రాజధాని అమరావతినే అని టీడీపీ తెల్చి చెప్తుంది. అంతే కాదు రాజధాని ప్రాంత రైతులకు అండగా నిలుస్తూ ఏపీ సర్కార్ పై పోరాటం చేస్తుంది. వైసీపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించలేదని, రాజధానిని తరలిస్తే ఊరుకోమని చెప్తోంది. అంతే కాదు రాజధాని ప్రాంత రైతులతో కలిసి పోరాటం చేస్తున్న టీడీపీ నాయకులు, అధినేత చంద్రబాబు వైసీపీ నేతలు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .

రాయలసీమలో రాజధాని .. మూడుప్రాంతాల్లోనూ అసెంబ్లీ : ఎంపీ టీజీ వెంకటేష్ సంచలనంరాయలసీమలో రాజధాని .. మూడుప్రాంతాల్లోనూ అసెంబ్లీ : ఎంపీ టీజీ వెంకటేష్ సంచలనం

ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ప్రజా క్షేత్రంలో ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పు ఏంటో తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఇక ఈ నేపధ్యంలో టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు .
మూడు రాజధానుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి దమ్మూ, ధైర్యం ఉంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మళ్లీ ప్రజాతీర్పు కోరాలని వైఎస్సార్‌సీపీ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సవాల్‌ చేశారు.

Resign with TDP MLAs and seek public judgement: YCP MLA Challenged Chandrababu

రాష్ట్రంలోని ప్రజలు అందరూమూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తూ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . ఏపీ అభివృద్ధికి చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందటం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుందని విమర్శలు గుప్పించారు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి.

English summary
YCP MLA Anantha venkatrami reddy outrage on TDP leaders about three capitals issue . He demanded that to resign tdp MLAs if they had the courage. he challenged tdp chief chandrababu naidu on this issue .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X