వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా చేయకపోతే డ్యామేజ్, వద్దే వద్దన్న చంద్రబాబు: వాళ్లు కన్నేశారు.. జాగ్రత్త!

|
Google Oneindia TeluguNews

అమరావతి: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ఇక చర్చకు రావడం అసాధ్యమే అనిపిస్తున్నవేళ.. వైసీపీ రాజీనామాల అస్త్రాన్ని సంధించడానికి ఇప్పటికే సిద్దమైపోయింది. అవిశ్వాసం విషయంలో వైసీపీనే ఫాలో అయిన చంద్రబాబు.. ఇప్పుడు రాజీనామాల విషయంలోనూ అదే పనిచేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం రాజీనామాలు వద్దే వద్దంటూ టీడీపీ ఎంపీలకు నిర్దేశం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

Recommended Video

వాళ్ల కన్నా ముందు నేనే సీఎం అయ్యా, 40 ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞుడిని నేను

ఇక రాజీనామాలే: 'స్పీకర్ ఫార్మాట్'లోనే సిద్దం చేసి పెట్టుకున్న వైసీపీ ఎంపీలు..ఇక రాజీనామాలే: 'స్పీకర్ ఫార్మాట్'లోనే సిద్దం చేసి పెట్టుకున్న వైసీపీ ఎంపీలు..

రాజీనామా చేయకపోతే డ్యామేజ్?:

రాజీనామా చేయకపోతే డ్యామేజ్?:

వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే.. టీడీపీ పట్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆ పార్టీ ఎంపీలు సీఎం చంద్రబాబుతో అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. టెలికాన్ఫరెన్స్ సందర్భంగా ఈ విషయాన్ని వారు వెల్లడించినట్టు చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పదవులను సైతం లెక్క చేయకుండా రాజీనామాలు చేస్తే.. టీడీపీ ఎంపీలు మాత్రం ఇంకా పదవులను పట్టుకునే వేలాడుతున్నారన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబుకు వారు గుర్తుచేశారట.

వద్దే వద్దన్న చంద్రబాబు..:

వద్దే వద్దన్న చంద్రబాబు..:

చంద్రబాబు మాత్రం ఎంపీల అభిప్రాయంతో ఏకీభవించడం లేదని చెబుతున్నారు. రాజీనామాలు చేస్తే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని, రాజీనామాల ఆలోచన వద్దని ఆయన స్పష్టం చేశారట. అయితే ప్రత్యేక హోదా విషయంలోనూ, అవిశ్వాసం విషయంలోనూ ఇప్పటికే యూటర్న్ తీసుకుని అభాసుపాలైన చంద్రబాబు.. ఇప్పుడు రాజీనామాల విషయంలోనూ తన వైఖరి మార్చుకునే అవకాశముందన్నది పరిశీలకుల అభిప్రాయం.

 కేసుల భయమా?:

కేసుల భయమా?:

రాజీనామాల విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తుండటంతో... వైసీపీ దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. కేసుల భయంతోనే చంద్రబాబు రాజీనామాలు చేయించడానికి సిద్దపడటం లేదని ఆ పార్టీ ప్రచారం చేయనుంది.

ఓటుకు నోటు కేసుకు భయపడి ఈ నాలుగేళ్లు చంద్రబాబు రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని, ఇప్పటికీ ఆ కేసు వెంటాడుతుంది కాబట్టే.. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయంలోనూ రాజీ పడుతున్నారని ఆ పార్టీ ఆరోపించడానికి సిద్దమైంది.

కన్నేసి ఉంచింది జాగ్రత్త..:

కన్నేసి ఉంచింది జాగ్రత్త..:

ప్రస్తుతం టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో.. ఏ చిన్న లొసుగు దొరికినా కేంద్రం తమ పైన కక్ష సాధించే అవకాశం ఉందని చంద్రబాబు ఎంపీలతో చెప్పారట. టీడీపీ సభ్యులందరిపై కేంద్రం కన్నేసి ఉంచిందని, ఇలాంటి తరుణంలో రాజీనామాలకు వెళ్లడం మరిన్ని చిక్కుల్లో పడేస్తుందని చెప్పారట.

English summary
Andhrapradesh Chief Minister Chandrababu Naidu said TDP MP's do not think to resign to their posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X