విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ మరో సంచలనం: వైఎస్ విగ్రహానికి నివాళి..జోహార్ వైఎస్సాఆర్ అంటూ..!

|
Google Oneindia TeluguNews

విజయవాడ: కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలను పుట్టిస్తూ, తెలుగుదేశం పార్టీల్లో కల్లోలాన్ని సృష్టిస్తూ వస్తోన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. మరోసారి సంచలనం రేపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినదించారు. వల్లభనేని వంశీ ఒక్కరే కాదు.. ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో వైఎస్ కు జోహార్లు అర్పించారు. దీనితో- రాజకీయంగా తన మలి అడుగు ఏమిటో వంశీ.. చెప్పకనే చెప్పినట్టయింది.

 వైఎస్ జగన్ తో యార్లగడ్డ భేటీ ముగిసిన కొన్ని గంటల్లోనే..

వైఎస్ జగన్ తో యార్లగడ్డ భేటీ ముగిసిన కొన్ని గంటల్లోనే..

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో గన్నవరం సీనియర్ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావ్ భేటీ ముగిసిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వల్లభనేనితో కలిసి పని చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ యార్లగడ్డ స్పష్టం చేయడం, ఆ వెంటనే వల్లభనేని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం చర్చనీయాంశమైంది.

శబరిమల వెళ్లొచ్చిన తరువాతేనా..

శబరిమల వెళ్లొచ్చిన తరువాతేనా..

వల్లభనేని వంశీ ప్రస్తుతం అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. అయ్యప్ప మాలధారణ చేశారు. త్వరలోనే ఆయన శబరిమలకు వెళ్లనున్నారు. అయ్యప్పుడిని దర్శించుకుని, దీక్షను ముగించిన తరువాతే ఆయన.. వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ తెలుస్తోంది. ఈలోగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో లాంఛనప్రాయంగా సమావేశం కావచ్చని చెబుతున్నారు. ఏరోజు ముఖ్యమంత్రిని కలుసుకుంటారనేది తేలాల్సి ఉంది.

యార్లగడ్డ కూడా మెట్టుదిగినట్టే..

యార్లగడ్డ కూడా మెట్టుదిగినట్టే..

వల్లభనేని వంశీ రాకను వ్యతిరేకిస్తోన్న గన్నవరం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావ్ కూడా ప్రస్తుతం మెట్టు దిగినట్టే కనిపిస్తోంది. బుధవారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశమైన విషయం తెలిసిందే. వల్లభనేని వంశీ రాకపై తన నిరసనను, అసంతృప్తిని ఆయన జగన్ కు వినిపించారు. జగన్ ఆయనకు ఎలాంటి భరోసా ఇచ్చారో తెలియట్లేదు గానీ.. యార్లగడ్డ మాత్రం కాస్త బెట్టు వీడారు. స్వతహాగా తాను జగన్ అభిమానినని, ఆయనను వదిలి తాను ఏ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని యార్లగడ్డ వెల్లడించారు.

English summary
Resigned Telugu Desam Party MLA Vallabhaneni Vamsi and his followers was garlanding to late Chief Minister of Andhra Pradesh Dr YS Rajasekhar Reddy statue on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X