వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు పునర్నియామకం.. సర్కార్ కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ఏపీలో పెట్టుబడులు ప్రోత్సహించటానికి ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును మళ్లీ తెరపైకి తీసుకువచ్చేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే గత ఆరు నెలల కాలంలో ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు పెట్టుబడిదారులకు ఇబ్బందికరంగా మారి ఏపీలో పెట్టుబడులు పెట్టటానికి ఆసక్తి చూపించలేదు. ఈ పరిస్థితుల నుండి గట్టెక్కించటానికి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఉంది.

టీడీపీ ఎంపీ కేశినేని నానీకి కేంద్రంలో మరో కీలక పదవి .. రీజన్ ఇదేనా ?టీడీపీ ఎంపీ కేశినేని నానీకి కేంద్రంలో మరో కీలక పదవి .. రీజన్ ఇదేనా ?

ఏపీలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావటం లేదని ప్రతిపక్షాల విమర్శలు

ఏపీలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావటం లేదని ప్రతిపక్షాల విమర్శలు

ఏపీ లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని, పెట్టుబడిదారులు ఏపీ వైపు కన్నెత్తి చూడటం లేదని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దక్షిణాదిలో ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిట్టచివర్లో ఉండటం ఏపీ దురదృష్టమని ఇటీవల ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రగతి పతనావస్థకు చేరుకుందని ఇందుకు నీతిఆయోగ్ నివేదిక సాక్ష్యం అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

నీతిఆయోగ్ నివేదికలోనూ ఏపీ దక్షిణాదిలో ఆఖరిస్థానం

నీతిఆయోగ్ నివేదికలోనూ ఏపీ దక్షిణాదిలో ఆఖరిస్థానం

నీతి ఆయోగ్ నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదో స్థానంలో నిలిచిందని ఇప్పటికే వైసీపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు.గత టిడిపి ప్రభుత్వ హయాంలో సులభతర వాణిజ్యం తోనే దేశంలో మొదటి స్థానంలో నిలిచామని, పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను ఆకర్షించి పెట్టుబడులు పెట్టించడానికి గత ప్రభుత్వం కృషి చేసిందని చెప్తూనే వైసీపీ పాలనా దెబ్బకు రాష్ట్రం నుండి పెట్టుబడిదారులు పారిపోతున్నారని టీడీపీ మండిపడింది. ఇక ప్రతిపక్ష పార్టీల విమర్శలే కాకుండా పెట్టుబడిదారులు ఆసక్తి చూపించకపోవటం అధికార పార్టీకి కంటకంగా మారింది.

పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును పునర్నియామకం ..పెట్టుబడులు ఆకర్షించేందుకే

పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును పునర్నియామకం ..పెట్టుబడులు ఆకర్షించేందుకే

ఏపీలో పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ మేరకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం . ఈ బోర్డుకు సీఎం జగన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇందులో 10 మంది సభ్యులు ఉంటారు. వారిలో 9 మంది మంత్రులు కాగా,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా స్థానం కల్పించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహకానికి సిఫారసులు,నిర్ణయాలు తీసుకోవడం ఈ బోర్డు విధి.ఇక పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు పునర్నియామకంతో ఏపీలో పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులపై దృష్టి సారించనుంది ఏపీ సర్కార్ .

English summary
The AP government has issued an order promoting the restructuring of the Investment Promotion Board to this end. The board is headed by CM Jagan. It consists of 10 members. Nine of them were ministers, and the one position of general secretary of government. It is the duty of this board to make recommendations and decisions for investment promotion in the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X