హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిజల్ట్స్ డే.. ఆర్డీటీ స్టేడియంలోని 9వ నంబర్ గదిలో బాలయ్య బస .. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

ఏపీ ఎన్నికల సమయంలో తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన బాలకృష్ణ కోపం వస్తే తిట్ల దండకం కురిపించాడు. బాలయ్య ఏది చేసినా ఆయనకంటూ ఓ స్టైల్ ఉంటుంది . అలాంటి బాలకృష్ణ ఏపీ ఎన్నికలకు ఫలితాలు రేపు విడుదల కానున్న నేపధ్యంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చాలా మంది ఫలితాలు ఎలా ఉంటాయో అన్న టెన్షన్లో ఉంటే .. రేపు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బాలయ్య సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.

ఏపీలో వైసీపీకి 43 శాతం..టీడీపీకి 38 శాతం ఓట్ షేరింగ్ : హిందూ- సీఎస్‌డిఎస్-లోక్‌నీతి స‌ర్వే..!ఏపీలో వైసీపీకి 43 శాతం..టీడీపీకి 38 శాతం ఓట్ షేరింగ్ : హిందూ- సీఎస్‌డిఎస్-లోక్‌నీతి స‌ర్వే..!

రిజల్ట్స్ డే... బాలయ్య సెంటిమెంట్ .. 2014 లో ఆర్డీటీ స్టేడియంలో రూమ్ నంబర్ 9లో బాలయ్య బస

రిజల్ట్స్ డే... బాలయ్య సెంటిమెంట్ .. 2014 లో ఆర్డీటీ స్టేడియంలో రూమ్ నంబర్ 9లో బాలయ్య బస

సినీ హీరోగా ప్రేక్షకులను అలరించిన బాలయ్య రాజకీయాల్లోకి గత ఎన్నికల సమయంలో అడుగుపెట్టారు. ఆయన వ్యక్తిగతంగా సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అలాంటి బాలయ్య ఈ ఎన్నికల ఫలితాల్లో కూడా ఆయన ఓ సెంటిమెంట్ ని బాగా నమ్ముతున్నారు. 2014 ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్కేయూలో కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. కౌంటింగ్‌ సమయంలో 2014లోనూ ఆర్డీటీ స్టేడియంలో బాలకృష్ణ బస చేశారు. అదికూడా స్టేడియంలోని 9వ నెంబర్‌ గదిలో బస చేశారు.

2019 ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మరోమారు ఆర్డీటీ స్టేడియంలో రూమ్ నంబర్ 9లో బస చెయ్యనున్న బాలయ్య

2019 ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మరోమారు ఆర్డీటీ స్టేడియంలో రూమ్ నంబర్ 9లో బస చెయ్యనున్న బాలయ్య

ఇక తాజాగా.. మరోసారి అదే హిందూపురం నుంచి రెండోసారి శాసనసభ్యుడిగా టీడీపీ తరపున బరిలోకి దిగారు. మళ్లీ కౌంటింగ్‌ ప్రక్రియను జిల్లా కేంద్రంలోని ఎస్కేయూలో నిర్వహిస్తున్నారు. బాలయ్య కౌంటింగ్‌కు జిల్లా కేంద్రానికి వస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో ఉన్న గదిలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే ఆర్డీటీ మరొకరికి ఆ గదిని కేటాయించింది. అయినప్పటికీ బాలయ్య కోరిక మేరకు రూమ్‌ నెంబర్‌ 9ని ఖాళీ చేయించి బాలయ్యకే కేటాయించి బసకు సిద్ధం చేశారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆర్డీటీ స్టేడియంకు బాలకృష్ణ చేరుకుంటున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తీ చేశారు.

బాలయ్య సెంటిమెంట్ ... ఎన్నికల్లో గట్టెక్కిస్తుందా?

బాలయ్య సెంటిమెంట్ ... ఎన్నికల్లో గట్టెక్కిస్తుందా?

ఏది ఏమైనా బాలయ్య ఎన్నికల ఫలితాల సెంటిమెంట్ రూమ్ నంబర్ 9 ఈ దఫా కలిసొస్తుందా? బాలయ్య కు ఈ సారి ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చామని భావిస్తున్న వైసీపీ ని ఓడించి బాలకృష్ణ మరోమారు ఎమ్మెల్యేగా గెలుస్తారా అన్నది ఉత్కంఠ కలిగించే అంశమే .

English summary
Balayya, who has entertained audiences as a movie hero, has entered politics during the last election. He will personally follow the sentiments individually. Balayya also convinced of a sentiment in this election result. He contested from the constituency of the Hindupur constituency in the 2014 elections.The counting process was conducted at SKU, in the district center. Balakrishna stayed at the RDT Stadium in 2014 during Counting. It also stayed in the room no 9 of the stadium. Balayya also stayed in the same room during this counting and will be in the sentiment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X