వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ చంద్ర‌బాబు..ఆ మాజీ అధికారుల వెనుక ఉన్న‌దెవ‌రు..!

|
Google Oneindia TeluguNews

ఏపి ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతోంది. ప్ర‌భుత్వం లో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ప‌ని చేసిన ఆ అధికారులు ఎందుకు ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే చ‌ర్చ ప్ర‌భుత్వంలో ప‌ని చేస్తున్న అధికారుల తో పాటుగా అధికార పార్టీ నేత‌ల్లోనూ ప్ర‌ధానంగా సాగుతోంది. ఏదైనా రాజ‌కీయ ల‌క్ష్యంతో వీరు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నా రా లేక‌..జ‌రిగిన అవినీతిని బ‌య‌ట పెట్ట‌టానికే ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారా. ఏపి ప్ర‌భుత్వంలో చీఫ్ సెక్ర‌ట్రీ స్థాయిలో ప‌ని చేసి ఇప్పుడు అనేక అంశాల పై ఓపెన్ గా మాట్లాడుతున్న ఆ అధికారుల అస‌లు ల‌క్ష్యం ఇప్పుడు ఏపి రాజ‌కీయాల్లో కొత్త కోణం గా..న‌యా స‌మీక‌ర‌ణాల‌కు నాందిగా మారుతోంది.

తొలి సీయ‌స్..నిర్ధిష్ఠ ల‌క్ష్యం

తొలి సీయ‌స్..నిర్ధిష్ఠ ల‌క్ష్యం

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌రువాత ఏపికి తొలి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ప‌ని చేసారు ఐవైఆర్ కృష్ణారావు. సీ య‌స్ గా ఆయ‌న ఉన్న స‌మ‌యంలోనే కీల‌క‌మైన రాజ‌ధాని ఒప్పందాలు..ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యాలు జ‌రిగాయి. అయితే ఎప్పుడూ ఆయ‌న అందులో క్రియా శీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేదు. సీయ‌స్‌గా రిటైర్ అయిన త‌రువాత ఐవైఆర్ ను ఏపి బ్రాహ్మ‌ణ సంక్షేమ సంఘం ఛైర్మ‌న్ గా నియ‌మించారు. అయితే, ఆ ప‌ద‌విలో ఉంటూ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన కార‌ణం గా స‌డ‌న్ గా ఐవైఆర్ ను ఆ ప‌ద‌వి నుండి తొలిగించారు. ఆ నాటి నుండి ఐవైఆర్ ప్ర‌భుత్వం పై యుద్దం ప్రారంభించారు. తొలుత ప్రెస్‌మీట్లు..ట్వీట్లు..ఫేస్ బుక్ పోస్టింగ్‌ల ద్వారా త‌న అభిప్రాయాల‌ను చెప్పేవారు. ఆ త‌రువాత రాజ‌కీయంగానూ విమ‌ర్శ‌లు చేసారు. కొద్ది కాలం క్రితం ఏకంగా అమిత్ షా స‌మ‌క్షంలో బిజెపి లో చేరారు. అప్ప‌టి నుండి రాజ‌ధాని వ్య‌వ‌హా రంలో ప్ర‌భుత్వ తీరును...రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణయాల‌ను విమ‌ర్శిస్తున్నారు. ఐవైఆర్ చేస్తున్న విమ‌ర్శ‌ల వెనుక రాజ‌కీయ కోణం ఉంద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ...ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ప‌ని చేసిన వ్య‌క్తి కావ‌టంతో ఆయ‌న ప్ర‌భుత్వ నిర్ణ‌యాల పై చేస్తున్న విమ‌ర్శ‌లు..ప్ర‌స్తుత అధికారుల పై ప్ర‌భావం చూపిస్తు న్నాయి. దీంతో..కొంద‌రు అధికారులు..తాము తీసుకుంటున్న నిర్ణ‌యాల్లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అంద‌ని నాడి..అజ‌య్ క‌ల్లాం

అంద‌ని నాడి..అజ‌య్ క‌ల్లాం

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేసి రిటైరైన మ‌రో అధికారి అజ‌య్ క‌ల్లాం. ఆయ‌న సైతం ఐవైఆర్ మార్గాన్నే ఎం చుకున్నారు. రాజ‌కీయంగా ఏ పార్టీలో చేర‌న‌ప్ప‌టికీ..ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను మాత్రం బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు. తాను హోదాలో ఉండ‌గానే అనేక నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించాన‌ని క‌ల్లాం చెబుతున్నారు. ప్ర‌ధానంగా అమ‌రావ‌తిలో నిర్మించిన సచివాల‌యం..అసెంబ్లీ భ‌వ‌నాల నిర్మాణానికి చేసిన ఖ‌ర్చును అజ‌య్ క‌ల్లాం త‌ప్పు బ‌ట్టారు. అడుగుకు 11 వేలు ఖ‌ర్చు ఎందుక‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్న‌. అదే విధంగా..ప్ర‌భుత్వ శాఖ‌ల్లో సెల్ ఫోన్ల కొనుగోలు మొద‌లు అనేక వ్య‌వ‌హా రాల్లో..ముఖ్యంగా రాజ‌ధాని భూ స‌మీక‌ర‌ణ అంశంలో అజ‌య్ క‌ల్లాం అనేక సందేహాలు వ్య‌క్తం చేసారు. అయితే, రాజ‌కీ యంగా కాకుండా..అంశాల వారీగానే అజ‌య్ క‌ల్లాం ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టంతో..ప్ర‌భుత్వం సైతం స‌మాధానాలు చెప్ప టానికి కొంత ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తోంది. దీంతో..ఏపి ప్ర‌ణాళికా సంఘం వైస్ ఛైర్మ‌న్‌తో ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొట్టే ప్ర‌య త్నం చేస్తోంది. ప‌ద‌విలో ఉన్న స‌మంయ‌లో..ఈ వ్య‌వ‌హారాల పై ఎందుకు మాట్లాడ‌లేదంటే....తాము బాధ్య‌తాయుత మైన ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు కొన్ని ప‌రిమితులు ఉంటాయ‌ని అజ‌య్ క‌ల్లాం చెబుతున్నారు.

కేంద్రానికి అస్త్రాలుగా మ‌రుతున్నారా

కేంద్రానికి అస్త్రాలుగా మ‌రుతున్నారా

ఎక్క‌డా లేని విధంగా..ప్ర‌భుత్వంలో ప‌ని చేసిన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలోని వ్య‌క్తులే ..ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌రు వాత ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేయ‌టం తో ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డుతోంది. ఇప్పుడు ఇటువంటి అధికారులు చే స్తున్న ఆరోప‌ణ‌లే కేంద్ర ప్ర‌భుత్వానికి అస్త్రాలుగా మారుతున్నాయి. వీరి స‌హ‌కారంతో కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రంలో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల పై మ‌రింత దృష్టి సారించేందుకు వీలుగా మారుతోంది. ఈ అధికారులే కాకుండా.. వివిధ హోదాల్లో ప‌ని చేసి కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిపోయిన అధికారులు సైతం కేంద్రానికి ఆయుధంగా మారుతున్నారు. ఏపి ప్ర‌భుత్వంలో జ‌రిగిన వ్య‌వ‌హారాల‌ను వారి నుండి సేక‌రించే ప్ర‌య‌త్నం కేంద్రం చేస్తోంది. ఇక‌, సీనియ‌ర్ ఐఏయ‌స్ అధికారులే ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తుంటే..ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న అధికారుల్లోనూ ఒకింత ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప్ర‌తీ నిర్ణ‌యాన్ని ఆచి తూచి తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే, అధికారుల విమ‌ర్శ‌ల‌ను సైతం రాజ‌కీయ కోణం లో ప్ర‌భుత్వం తిప్పి కొట్టినా..ఖ‌చ్చితంగా ఇవి మాత్రం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యే ప‌రిస్థితి. కొంద‌రు రాజ‌కీయ నేత లే వీరిని వెనుక ఉండి న‌డిపిస్తున్నార‌నే విమ‌ర్శ ఉంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ..టార్గెట్ చంద్ర‌బాబు గా ఈ మాజీ అధికారులు రానున్న రోజుల్లొ ఎటువంటి అంశాలు తెర మీద‌కు తెస్తారో అనే ఆసక్తి..ఉత్కంఠ నెలకొంది.

English summary
Retired Chief secretary s IYR Krsihna rao and Ajay kallam targetting AP govt. Both officers criticising govt desicions in administration. But politically these officers comments becoming hot topic in AP. now..ruling party leaders seriously reacting on thier comments against govt. Tdp leaders alleged that some hidden ageneda behind them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X