వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: రేవంత్ కోసం స్టీఫెన్ ఇళ్లంతా కెమెరాలు? గతంలోను ఎన్నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసు వ్యవహారంలో కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తన వ్యాఖ్యలతో తెరాస ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే రేవంత్.. ఆదివారం నాడు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు లంచం ఇవ్వజూపుతూ పట్టుబడ్డారు.

రేవంత్ రెడ్డిని పక్కా ప్రణాళికతో స్టింగ్ ఆపరేషన్ ద్వారా కేసులో ఇరికించినట్లుగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. మరో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. స్టీఫెన్ సన్ ఇంటి నిండా కెమెరాలు అమర్చారని తెలుస్తోంది.

గదిలోని ప్రతి అంగుళాన్ని కవర్ చేసేలా, ఎన్నో కెమెరాలు అమర్చారని తెలుస్తోంది. లాంగ్ షాట్, క్లోజ్ షాట్.. ఇలా పలు కోణాల్లో వాటిని అమర్చారని తెలుస్తోంది. రేవంత్ ఒక సోఫాలో కూర్చుంటే వేరే కెమెరాలు, నిలబడి మాట్లాడితే మరో కెమెరా.. ఇలా అమరమచినట్లుగా తెలుస్తోంది. మోషన్ కెమెరాలు కూడా పెట్టారని అంటున్నారు. కెమెరాల అమరికలో పక్కాగా అమర్చారని అంటున్నారు.

Revanth issue: CCTV cameras in Stephenson house

నోటుకు ఓటు గతంలోను...

ఓటుకు నోటు కేసులు గతంలోను బయటపడ్డాయి. 1993లో నాటి ప్రధాని పీవీ నర్సింహా రావు హయాంలో.. అవిశ్వాస తీర్మానం కోసం నలుగురు జేఎంఎం ఎంపీలకు ముడుపులు ఇచ్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇందులో అందరికీ క్లీన్ చిట్ లభించింది.

2005 డిసెంబర్ 23న పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే కేసులో 10 మంది లోకసభ, 1 రాజ్యసభ ఎంపీని బహిష్కరించారు.

2008 జూలై 22న యూపీఏకు మద్దతుగా ఓటు వేయాలని తమకు లంచం ఇవ్వచూపారని బీజేపీ ఎంపీలు ముగ్గురు సభలో డబ్బును ప్రదర్శించారు.

English summary
Revanth issue: CCTV cameras in Stephenson house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X