హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను కొడతారేమో, కోపం అలా కనిపిస్తోంది!: రేవంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికారులే దేహశుద్ది చేస్తారేమోనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కొడంగల్ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి శనివారం మండిపడ్డారు. జగన్‌ను కోర్టులో ఇటీవల ఒక ఐఎఎస్ అధికారి నిలదీసి మాట్లాడటం అధికారుల్లో వైయస్, జగన్‌ల పట్ల నెలకొన్న ఆగ్రహానికి అద్దం పడుతోందన్నారు.

జగన్ అక్రమాస్తుల కేసుల్లోని అధికారులంతా ఒకేసారి కోర్టుకు వస్తే జగన్‌కు అక్కడే దేహశుద్ధి చేసే రోజు కూడా వస్తుందేమో అన్నారు. దురాశాపరులైన తండ్రీ కొడుకులను నమ్ముకొన్న సహచర మంత్రులు, ఐఎఎస్ అధికారులు కోర్టులు, జైళ్ళ చుట్టూ అవమానభారంతో తిరుగుతున్నారన్నారు.

కంపెనీలు, బంగళాలు వారికైతే జైళ్ళు, కోర్టులు తమకా అన్న ఆవేదనతో తిరగబడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పని చేసిన అధికారులు కరెన్సీ నోట్లపై సంతకాలు పెడితే వైయస్, జగన్ పుణ్యాన వారి వద్ద పనిచేసిన అధికారులు జైలు రిజిష్టర్లలో సంతకాలు పెట్టాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.

కావూరికి సమైక్య సెగ

శనివారం రచ్చబండలో పాల్గొనేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వచ్చిన కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరు సాంబశివ రావును సమైక్యవాదులు అడ్డుకున్నారు. మంత్రి సభావేదిక వద్దకు రాగానే వందలాది మంది సమైక్యవాదులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ కావూరుకి వినతి పత్రం అందజేశారు.

2009లో విభజనకు వ్యతిరేకంగా పోరాడిన మీరు మంత్రి పదవి ఇవ్వగానే లొంగిపోయారంటూ కావూరును నిలదీశారు. దీనిపై కావూరు స్పందిస్తూ తాను ఇప్పటికీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డికీ సమైక్యవాదుల నుంచి అనంతలో తీవ్ర నిరసన ఎదురైంది. అనంత స్థానిక మున్సిపల్ అతిథిగృహంలో మంత్రి ఉన్నారన్న సమాచారంతో సమైక్యవాదులు అతిథిగృహాన్ని ముట్టడించారు. సమైక్యద్రోహి రఘువీరా అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి స్పందిస్తూ రాష్ట్రం విడిపోదన్నారు.

English summary
Telugudesam Party senior leader Revanth Reddy on Saturday fired at YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X