దిమ్మతిరిగే షాక్: యాత్రకు ముందు జగన్‌కు కొత్త అస్త్రాన్ని అందించిన రేవంత్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏపీలో వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ముందు మంచి అస్త్రాన్ని ఆయనకు అందించారా? అంటే అవుననే అంటున్నారు.

చదవండి: అందుకే టిడిపిలో చేరట్లేదు: అంతకుముందు బాబుతో బుట్టా రేణుక, మరికొంతమందీ

నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ ఏపీలో పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలు, ప్రత్యేక హోదా అంశాలతో పాటు తాను చేయబోయే వాటిని ఆయన ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్నారు. అయితే రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

చదవండి: జగన్‌కు గట్టి షాక్: బెయిల్ సందర్భంలో.. నాలుగేళ్లకు తప్పుదిద్దుకున్న సిబిఐ!

జగన్‌ను టార్గెట్ చేసిన ఏపీ టిడిపి

జగన్‌ను టార్గెట్ చేసిన ఏపీ టిడిపి

కొద్ది రోజుల క్రితం కృష్ణా నీటి విషయమై ఏపీ టిడిపి నేతలు.. జగన్‌కు చెందిన సాక్షి పత్రికపై మండిపడ్డారు. సాక్షి పత్రిక ఏపీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తోందని, జగన్ పక్క రాష్ట్రంలో ఉంటూ ఏపీపై విషం కక్కుతున్నాడని ఏపీ టిడిపి మండిపడింది.

  రేవంత్ మనసు నుంచి సంచలనాలు : కేసీఆర్, పరిటాల, యనమల పై హాట్ కామెంట్స్ | Oneindia Telugu
  జగన్‌కు రాష్ట్రంలో చోటు లేదని ఆగ్రహం

  జగన్‌కు రాష్ట్రంలో చోటు లేదని ఆగ్రహం

  కృష్ణా నీటి విషయంలో కల్పితాలు రాసి తెలంగాణను ఏపీ పైకి రెచ్చగొడుతున్నారని, తద్వారా జగన్, ఆయన మీడియా ఏపీకి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. ఆయనకు రాష్ట్రంలో చోటు లేదని మండిపడింది.

  పాదయాత్రకు ముందు రేవంత్ అందించిన ఆయుధం

  పాదయాత్రకు ముందు రేవంత్ అందించిన ఆయుధం

  ఇప్పుడు హఠాత్తుగా, జగన్ పాదయాత్రకు ముందు.. రేవంత్ రెడ్డి వైసిపికి ఓ ఆయుధం అందించినట్లుగా ఉందని అంటున్నారు. కేసీఆర్ నుంచి ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీతలు కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు జగన్‌కు ఆయుధాలుగా కానున్నాయి.

  కేసీఆర్‌తో కలిసి డబ్బు దండుకుంటున్నారని

  కేసీఆర్‌తో కలిసి డబ్బు దండుకుంటున్నారని

  తనను విమర్శిస్తున్న టిడిపి నేతలు కేసీఆర్‌తో జతకట్టి కాంట్రాక్టులు దక్కించుకొని డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించేందుకు జగన్‌కు అవకాశం వచ్చిందంటున్నారు. రేవంత్ రెడ్డి మామూలు ఆరోపణలు చేయలేదు. కాబట్టి అవి కచ్చితంగా జగన్‌కు మంచి ఆయుధాలు అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that Telangana Telugu Desam Party leader Revanth Reddy gave new astra to YSR Congress Party chief YS Jaganmohan Reddy.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X