హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ-టీఆర్ఎస్ ఒప్పందం: రేవంత్ 'రాజీనామా' స్కెచ్, అందుకే బాబు మౌనం?

కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన రాజీనామా ఎక్కడ ఉంది? చంద్రబాబుకు నిజంగానే ఇచ్చారా? ఇస్తే ఆయన ఎందుకు పంపించడం లేదు?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన రాజీనామా ఎక్కడ ఉంది? చంద్రబాబుకు నిజంగానే ఇచ్చారా? ఇస్తే ఆయన ఎందుకు పంపించడం లేదు? రేవంత్ స్వయంగా స్పీకర్‌కు ఇవ్వవచ్చు కదా అనే చర్చ సాగుతోంది.

చదవండి: రేవంత్ ప్లాన్, రమణపై ఆగ్రహం అందుకే

రాజీనామాపై రాహుల్ గాంధీ ఆలోచన ఇదీ

రాజీనామాపై రాహుల్ గాంధీ ఆలోచన ఇదీ

రేవంత్ రాజీనామా అంశం ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందిపెట్టేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజీనామా చేసిన రేవంత్ ఉప ఎన్నికల్లో తన సత్తా నిరూపించుకోవాలని రాహుల్ భావించారని తెలుస్తోంది. కానీ రేవంత్ మాత్రం దూకుడుగా కనిపిస్తున్నప్పటికీ ఆ ఆలోచన కనిపించడం లేదని తాజాగా తేటతెల్లమవుతోందని అంటున్నారు. తొలుత చిత్తశుద్ధి కనిపించినట్లుగా అనిపించిందని, కానీ అదంతా వట్టిదేననే వాదనలు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్-టీడీపీ ఒప్పందం, రాజీనామా అస్త్రం

టీఆర్ఎస్-టీడీపీ ఒప్పందం, రాజీనామా అస్త్రం

ఇదిలా ఉండగా రాజీనామా పేరుతో రేవంత్ రెడ్డి పెద్ద స్కెచ్ వేశారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే ఆయన తెలంగాణలో టీడీపీ - టీఆర్ఎస్ లోపాయకారిగా ముందుకు పోతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. దానిని నిరూపించే ఉద్దేశ్యంలో భాగంగా కూడా ఈ రాజీనామాను చంద్రబాబుకు ఇచ్చినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

అందులో భాగంగా రాజీనామా ఇచ్చారు

అందులో భాగంగా రాజీనామా ఇచ్చారు

ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్‌లపై రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. వారికి లేదా వారి బంధువులకు కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చిందని విమర్శించారు. దీనిపై వారు వివరణ కూడా ఇచ్చారు. అలాగే తెలంగాణ టీడీపీ నేతలు కేసీఆర్ తొత్తులు అని విమర్శిస్తున్నారు. అయితే దీనిని రుజువు చేసే ఉద్దేశ్యంలో భాగంగానే రాజీనామాను బాబుకు ఇచ్చారని అంటున్నారు.

రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే

రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే


గత నెల 28వ తేదీన అమరావతి వెళ్లిన రేవంత్.. అక్కడ రాజీనామా సమర్పించారు. తన రాజీనామా పత్రం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఫార్వార్డ్ చేయాల్సి ఉంది. లేదా ఇక్కడ రేవంత్ మరోసారి రాజీనామా సమర్పించాల్సి ఉంది. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాను స్పీకర్‌కే నేరుగా ఇవ్వవచ్చు కదా అని తెలంగాణ టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.

 అలా టీడీపీ - టీఆర్ఎస్ లోపాయకారితనం అని చెప్పేందుకే

అలా టీడీపీ - టీఆర్ఎస్ లోపాయకారితనం అని చెప్పేందుకే

తన రాజీనామా పత్రాన్ని చంద్రబాబు ఫార్వార్డ్ చేస్తే టీడీపీ - టీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం తెలుస్తోందని రేవంత్ విమర్శించేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే గతంలో 12 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి తెరాసలో చేరారు. వారిని కూడా చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలు విమర్శించారు. కానీ వారి రాజీనామాలపై అందరికంటే గట్టిగా మాట్లాడింది రేవంత్. ఇప్పుడు చంద్రబాబు తన రాజీనామా పత్రాన్ని ఫార్వార్డ్ చేస్తే.. నిన్నటి వరకు గట్టిగా మాట్లాడని వారు ఇప్పుడు తన రాజీనామా ఆమోదానికి కారణమయ్యారని, మిగతా 12మంది రాజీనామాలపై కూడా అంతే గట్టిగా మాట్లాడమని తెలంగాణ టీడీపీ నేతలను డిమాండ్ చేసే అవకాశముంది.

ఈ కారణంగానే చంద్రబాబు ఆగిపోయారా

ఈ కారణంగానే చంద్రబాబు ఆగిపోయారా

అయితే రేవంత్ వ్యూహం పసిగట్టినందువల్లే చంద్రబాబు దానిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఫార్వార్డ్ చేయడం లేదా అనే చర్చ సాగుతోంది. పైగా ఏపీలోను వైసీపీ నుంచి తమ పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చారు. రేవంత్‌ది పార్వార్డ్ చేస్తే, జగన్ మరింత గట్టిగా నిలదీస్తారు. ఈ నేపథ్యంలో తలనొప్పి ఎందుకని చంద్రబాబు దానిపై వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఉండవచ్చునని భావిస్తున్నారు.

 ఇదీ తెలంగాణ టీడీపీ నేతల వాదన

ఇదీ తెలంగాణ టీడీపీ నేతల వాదన

రేవంత్ రాజీనామాపై తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన అసలు రాజీనామా పత్రాన్ని బాబుకు ఇవ్వలేదని చెబుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు ఇవ్వాలని అంటున్నారు. తద్వారా చంద్రబాబు తన వద్ద ఉన్న పత్రాన్ని ఫార్వార్డ్ చేయకపోయినా ఫరవాలేదు. అలా ఇబ్బంది ఉండదనే స్పీకర్‌కు ఇవ్వవచ్చు కదా అనే డిమాండును గట్టిగా వినిపిస్తున్నారా అనే చర్చ సాగుతోంది.

English summary
Kodangal MLA Revanth Reddy, who defected from the Telugu Desam to the Congress in Telangana two weeks ago, has become an embarrassment for Congress vice president Rahul Gandhi, due to the former’s flip flop on resigning from the Assembly and facing a by election at the earliest. Rahul Gandhi wants Revanth to face a fresh election, but the latter seems to be not ready.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X