• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబు కన్నీరు - బలహీనుడిగా : జగన్ జైళ్లో ఉన్నా - అందుకే నచ్చుతారు : ఆర్జీవి షాకింగ్ కామెంట్స్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

వివాదాస్పద సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ సినిమాల పైనే కాదు... రాజకీయాల పైన ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. ఏ విషయాన్ని అయినా కాంట్రవర్సీ చేయటం.. విభిన్నంగా వ్యవహిరించటం కామన్. ఇక, ఇప్పుడు ఆయన ఏపీలో తాజాగా రాజకీయ పరిణామాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీరు పెట్టిన అంశం పైనా..అదే విధంగా జగన్ పైనా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వీటి పైన స్పందించారు.

చంద్రబాబు కన్నీరుపై భిన్నాభిప్రాయాలు

చంద్రబాబు కన్నీరుపై భిన్నాభిప్రాయాలు

చంద్రబాబు లాంటి వ్యక్తి కన్నీరు పెట్టటం..అదుపు చేసుకోలేకపోవటం చూసి ఏంటి ఆయన్ను అంతలా ఈ దుర్మార్గులు ఏడిపిస్తున్నారా అనే వారు ఉన్నారని చెప్పారు. అదే సమయంలో మరి కొందరు నాడు ఎన్టీఆర్ ను ఏడిపించలేదా..ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నారంటూ వ్యతిరేకులు అనుకుంటారని చెప్పుకొచ్చారు. అదంతా డ్రామాగా చూసేవాళ్లు ఉన్నారని ఆర్జీవి వ్యాఖ్యానించారు. నేతలు ఈ మధ్య కాలంలో బూతుల్లో పోటీ పడుతున్నారన్నారు. ఎవరు కన్నీరు పెట్టుకున్నా అందులో వంద శాతం డ్రామా ఉండదన్నారు. అసలు ఉద్వేగం అనేది వస్తే దానికి పెంచి చూపించవచ్చని చెప్పారు.

బలహీనుడిగా గుర్తిస్తారు

బలహీనుడిగా గుర్తిస్తారు

కోపం నుంచే ఏడుపు వస్తుందని..అదే ఏడుపు వచ్చినప్పుడే కోపం పెరుగుతుందని విశ్లేషించారు. అసెంబ్లీలో చంద్రబాబు ఆవేశంగా మాట్లాడి వెళ్లి పోయారని..తరువాత ఆలోచించుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసారన్నారు. దాని పైన ఆలోచించారు.. ఏడుపు వచ్చేసిందంటూ ఆర్జీవి చెప్పుకొచ్చారు. అయితే, ఏడవటం ద్వారా బలహీనుడిగా గుర్తిస్తారని చెప్పారు. ఒక బలమైన నేత ఏడవటం తానెప్పుడూ చూడలేదన్నారు. ఆయన సాధించింది అంతా పోయిందనిపించిందని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ప్రకారం చూస్తే డ్రామాలాగానే చూపించాల్సి వస్తుందన్నారు.

జగన్ ఏనాడు కుంగిపోలేదు

జగన్ ఏనాడు కుంగిపోలేదు


చంద్రబాబు ఏడవటం చూసి అభిమానులు బాధపడతారు.. వ్యతిరేకులు డ్రామా అంటారని ఆర్జీవి చెప్పారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ గురించి ఆయ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను అభిమానించే నాయకుల్లో జగన్ ఒకరని ఆర్జీవి స్పష్టం చేసారు. ఆయన్ను చాలా దగ్గరగా చూశానని చెప్పారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో పలు మార్లు తాను పరిశీలించానని.. జైల్లో ఉన్నప్పుడు కానీ, తన తండ్రి మరణం సమయంలో కానీ...సింగిల్ గా ఫైట్ చేసిన సమయంలోనూ కుంగిపోలేదని ఆర్జీవి చెప్పుకొచ్చారు.

  Germany: Pilots Return To Work To Cover Tourism Demand
  అందుకే జగన్ నచ్చుతారు

  అందుకే జగన్ నచ్చుతారు

  జగన్ దైర్యంగా నిలబడ్డారని... అందుకే తనకు నచ్చుతారని ఓపెన్ గా చెప్పేసారు. టీడీపీ హయాంలో కూడా జగన్ తొణకలేదన్నారు. ఎవరు తోడుగా లేకపోయినా ఒక్కడే నిలబడ్డారని.. ఆయన ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చెరగలేదని ఆర్జీవి ఆసక్తి కరంగా వివరించారు. ఇవన్నీ చూసిన తరువాత తనకు ఆయనపై ఎప్పుడు కామెడీ చేయాలని.. కౌంటర్లు వేయాలని అనిపించలేదని చెప్పారు. ఇక, తాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్న కొండా సినిమా సైతం సంచలనం అవుతుందని రాంగోపాల్ వర్మ ధీమా వ్యక్తం చేసారు. ఇది త్వరలోనే విడుదల కానుందని ఆర్జీవి వెల్లడించారు.

  English summary
  Controversial director Ram Gopal Varma made key remarks about Chandrababu shedding tears and CM Jagan's style of working.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X