• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

"ఒక్కసీటు కూడా రాలేదు..ఒక్కటొచ్చింది సార్ కానీ మీకురాలేదు": పవర్‌స్టార్‌లో వర్మ పంచ్ డైలాగులు

|

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు షాక్ తగిలింది. ప్రస్తుతం పవర్ స్టార్ అనే సినిమాకు శ్రీకారం చుట్టిన ఆర్జీవీ... దానికి సంబంధించిన ట్రైలర్‌ బుధవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తానని చెప్పారు. కానీ అంతకుముందే నెట్టింట్లో టీజర్ వైరల్ అవుతోంది. అయితే ఈ టీజర్‌ను ఎవరు లీక్ చేసి ఉంటారా అనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇక ట్రైలర్ చూస్తే మాత్రం సినిమా ద్వారా ఎవరిని టార్గెట్ చేశారనేది మాత్రం స్పష్టం అవుతుంది.

ఆర్జీవీ పవర్ స్టార్ ట్రైలర్ లీక్

పవర్ స్టార్ (ఎన్నికల ఫలితాల తర్వాత కథ) అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న చిత్రం జనసేనాని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తీసిన సినిమానే అనేది ఆర్జీవీ చెప్పకపోయినా చూసినవారికి అర్థం అవుతుంది. సాధారణంగా ఆర్జీవీ సినిమా తీస్తే అందుకు ఏమాత్రం ఖర్చు లేకుండా ప్రజల్లోకి జస్ట్ మౌత్ టాక్‌తో ప్రమోట్ అయిపోతోంది. ప్రస్తుతం కరోనావైరస్ కారణంగా థియేటర్లు మూసివేయడంతో ఆన్‌లైన్‌లోనే తన సినిమాలను విడుదల చేస్తూ రాంగోపాల్ వర్మ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా కొన్ని సినిమాలను ఇప్పటికే విడుదల చేశారు రాంగోపాల్ వర్మ. తన సినిమాలను విడుదల చేసేందుకు rgvworldtheatre.comను ప్రారంభించారు. ఇక పవర్ స్టార్ సినిమాను జూలై 25న విడుదల చేయాలని భావించారు ఆర్జీవీ. అంతకుముందు ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని భావించిన ఈ సెన్సేషనల్ డైరెక్టర్‌కు ఎవరో లీక్ చేసి సెన్సేషనల్ షాక్ ఇచ్చారు.అయితే ట్రైలర్ లీకైన కాసేపటికే వర్మ అధికారికంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

20 లక్షల వ్యూస్ వచ్చేశాయ్..

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న విషయం ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ వస్తున్నారు రాంగోపాల్ వర్మ. ఇక మంగళవారం రోజున ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు వర్మ. ట్రైలర్ బుధవారం రిలీజ్ అవుతోందని దీనికి వ్యూస్ 20 లక్షలు రావాలని ఇందుకోసం ఎన్టీఆర్, మహేష్‌బాబు, అల్లుఅర్జున్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, రవితేజ, మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సహకరించాలని చెప్పారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవర్ ఇప్పుడు 20 లక్షలు తాకిందంటూ మరో ట్వీట్ చేశారు. ఇక గత కొద్దిరోజులుగా వర్మ ట్విటర్ పేజ్ మొత్తం పవర్ స్టార్ సినిమా చుట్టూ తిరిగింది. ఇక తాజాగా మరో ట్వీట్ చేశారు వర్మ. పవర్ స్టార్

అందరికీ డబ్బులు రీఫండ్ చేస్తాను

తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా చేసుకుని తీసిన సినిమా ట్రైలర్ లీక్ కావడంపై ఆర్జీవీ ట్విటర్ వేదికగా స్పందించారు. పవర్‌స్టార్ టీజర్ లీక్ తన సిబ్బంది నుంచే జరిగిందని ఇందుకు పూర్తి బాధ్యత తాను వహిస్తూ ఇప్పటికే డబ్బులు చెల్లించిన వారికి రీఫండ్ చేయడం జరుగుతుందని చెప్పారు వర్మ. ఇక ఎలాగూ లీకైంది కాబట్టి యూట్యూబ్‌లో విడుదల చేస్తామని వర్మ చెప్పారు. ఇక పవర్‌స్టార్ ట్రైలర్ విషయానికొస్తే కాస్త సెటైర్లు ఉన్న సీన్స్‌ ఉన్నాయి.

  Parannageevi First Song | ఈ పాట RGV గనక వింటే అంతే సంగతి | Oneindia Telugu

  ఒక్క సీటు కూడా రాలేదు..మీకు రాలేదు సార్

  ఒక్కసీటు ఒక్క సీటుకూడా రాలేదని ఈ చిత్రంలోని ప్రధాన క్యారెక్టర్ ప్రవణ్ కళ్యాణ్ చెబితే.. ఒక్క సీటు వచ్చింది సార్.. మీకు రాలేదనే పంచ్ డైలాగులను వర్మ వదిలారు. ఇందులో కొన్ని క్యారెక్టర్లు చిరంజీవి, చంద్రబాబునాయుడును పోలిఉన్నాయి. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అంకితంమంటూ బిగిన్ అవుతుంది. ఒక్క సీటు ఒక్క సీటు కూడా రాలేదా.. అనే డైలాగ్స్ ఉన్నాయి. ఇక చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర పోషించింది టిక్‌టాక్ స్టార్ నరేష్. మొత్తానికి ఆర్జీవీ పవర్ స్టార్ సినిమాతో మరో కాంట్రవర్సీకి తెరలేపారు. అయితే పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

  English summary
  Controversial Director Ramgopal Varma's new flick Powerstar trailer was leaked before the official release.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X