రిషికేశ్వరి కేసు: 'మైనర్ వేధింపు కేసు పెట్టాలి', బాబురావును శిక్షిస్తేనే: తండ్రి
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కేసులో గుంటూరు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆమె తరపు న్యాయవాది... ర్యాగింగ్‌కు గురైనప్పుడు ఆమె మైనర్ కావడంతో మైనర్ వేధింపుల కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం కేసు విచారణను కోర్టు ఈ నెల ఏడో తేదీకి వాయిదా వేసింది. కొద్ది రోజుల కింద పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. నాగార్జున వర్సిటీ ప్రిన్సిపల్ బాబురావును ఏ4 నిందితుడిగా పేర్కొన్నారు.
బాబూరావును అరెస్టు చేయాలని డిమాండ్
రిషికేశ్వరి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పైన ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో విచారణ కమిటీని వేసింది. ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదికలో అఫ్పటి ప్రిన్సిపల్ బాబురావు పాత్ర ఉందని స్పష్టం చేసింది.

బాబురావును ఛార్జీషీట్లో నాలుగో నిందితుడిగా చేర్చారని, ఇప్పటికైనా అతనిని అరెస్టు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ప్రజా, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రిషికేశ్వరి తండ్రి మురళీకృష్ణ మాట్లాడుతూ... బాబురావును శిక్షిస్తేనే తమ కూతురు కేసులో పూర్తి న్యాయం జరిగినట్లు అవుతుందని, ప్రస్తుతం పోలీసులు ఛార్జీషీటులో అతని పేరును చేర్చడం వల్ల కేసు న్యాయం వైపు అడుగులు వేస్తున్నట్లు భావించవచ్చునని చెప్పారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications