వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ కౌంటర్ నుంచి ఆర్కే తప్పించుకున్నాడా?...అందుకే ఆపరేషన్ ఆలౌట్

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

ఆంధ్రా-ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి జోడాంబు పంచాయతీ పరిధిలోని సిమిలిపోదర్‌ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే తృటిలో తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రదేశం నుంచి ఆర్‌కేతోపాటు మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు.

గురువారం ఉదయం 9 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో పోలీసులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. అనంతరం మావోయిస్టులు నుంచి ప్రతిఘటన నిలిచిపోవడంతో వారు పారిపోయినట్లు గ్రహించి పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేశారు. ఈ ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి 303 వ రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు.

RK escapes from Malkangiri encounter place?

ఈ సందర్భంగా ఒడిశా డీజీపీ ఆర్‌పీ శర్మ మాట్లాడుతూ మావోయిస్టుల అణచివేతకు ఛత్తీస్‌ గఢ్, ఆంధ్ర పోలీసులతో కలిసి ఒడిశా పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. అలాగే మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ రామకృష్ణ కోసం పోలీసులు మళ్లీ తీవ్రంగా గాలింపు యత్నాలు ఆరంభించారు. ప్రధానంగా ఆర్కేను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ సారి ఆపరేషన్ ఆర్కే పేరుతో ప్రత్యేకంగా గ్రూప్ ను ఎర్పాటు చేశారు. ఎలాగైనా ఆర్కే ను పట్టుకోవాలన్న లక్ష్యంతో పోలీసు బలగాలు ముందుకు దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా తమకు వచ్చిన ప్రతి ఆవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలిసింది.

మరోవైపు ఆంధ్రాలో తమ పట్టును పెంచుకునేందుకు మావోయిస్టు పార్టీ తీవ్రంగా కృషి చేస్తునేవుందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేతలు ఎప్పటికప్పుడు వచ్చి మీటింగ్ లు పెట్టిపోతున్నారని సమాచారం. ఈ విషయం తెలుసుకుని పోలీసులు బలగాలు తమ కూంబింగ్ ను తీవ్రతరం చేస్తున్నాయి. ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు భారీ ఎన్‌కౌంటర్‌లు జరిపి 38 మంది మావోయిస్టులను హతమార్చిన సంగతి తెలిసిందే.

మావోయిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం నవీన్‌ పట్నాయక్‌ మావోయిస్టులకు పిలుపునిచ్చిన విషయాన్ని పోలీసులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తాము కూడా అందులో భాగంగానే ఆపరేషన్‌ ఆలౌట్‌ను మల్కన్‌గిరి జిల్లా నుంచి ప్రారంభించామని వారు స్పష్టం చేస్తున్నారు. దీనికోసం గురువారం హెలికాప్టర్లతో సర్వే కూడా చేయించామన్నారు. మల్కన్‌గిరిలో తమ క్యాంప్‌లను కొనసాగిస్తామని తెలిపారు.

English summary
Visakha-Odisha: A Maoist camp was busted by the security personnel near Malkangiri deep forest onThursday. Acting on a tip-off, Odisha SOG, DVF and Andhra Pradesh, ChChhattisgarh Grey Hounds conducted a joint raid on a camp of the red rebels following which a heavy exchange of fire took place between police and the Maoists. However number of Maoists, including top leader RK escaped from the spot, said sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X