వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అచ్చెన్నాయుడుకి ఒళ్లు పెరిగింది, బుద్ధి కాదు: ఆర్కే రోజా, ఏపీలో లోక‌ల్ బాడీ ఎన్నికల వాయిదా హీట్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల వాయిదా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కరోనా వైరస్ ప్రబలుండటంతో.. ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే టీడీపీ మాత్రం ఎన్నికలు అంటే వైసీపీ భయపడుతోందని ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అధికార పార్టీపై నోరుపారేసుకున్నారు. అచ్చెన్నాయుడుకు ధీటుగా వైసీసీ ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు.

కారణమిదే..?

కారణమిదే..?

కరోనా వైరస్ వల్లే ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. కానీ టీడీపీ మాత్రం వైసీపీపై నెపం వేస్తుందని రోజా దుయ్యబట్టారు. భారతదేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా వైరస్ ప్రభావం అధికంగా ఉందని చెప్పారు. కానీ టీడీపీ నేతలు రాజకీయ ప్రయోజనం కోసం లేని పోని మాటలు మాట్లాడుతున్నారని రోజా దుయ్యబట్టారు.

బంద్.. బంద్...

బంద్.. బంద్...

కరోనా వైరస్ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలు విద్యాసంస్థలు మూసివేసిన విషయాన్ని ఆర్కే రోజా గుర్తుచేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేస్తే.. నెపం వైసీపీ వేయడంపై మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులే లేరని గుర్తుచేశారు. మాచర్ల ఘటనకు ఎన్నికల వాయిదా సంబంధం లేదని స్పష్టంచేశారు.

బుద్దిమాత్రం

బుద్దిమాత్రం


మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు ఒళ్లు పెరిగింది.. కానీ బుద్ది మాత్రం పెరగలేదని రోజా హాట్ కామెంట్స్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల వాయిదాకు వైసీపీ కారణం అని అచ్చెన్నాయుడు కామెంట్ చేయడంతో రోజా తీవ్రంగా స్పందించారు. అచ్చెన్నాయుడు బాధ్యతాయుతమైన నేతగా వ్యవహరించడం లేదని.. గల్లీ లీడర్‌గా వ్యవహరిస్తున్నారని రోజా ఫైరయ్యారు.

స్వాగతించిన దేవినేని

స్వాగతించిన దేవినేని

5 కోట్ల మంది ప్రజలు, రాజకీయ పార్టీలు ఏపీ ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని దేవినేని ఉమా తెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఎన్నికలు వాయిదా పడ్డాయని భయపడిపోతోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సిన పనిని ఎన్నికల సంఘం చేసిందని గుర్తుచేశారు. మీరు సరిగ్గా బాధ్యత నిర్వహిస్తే.. ఈసీ కల్పించుకోవాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. మీ డ్యూటీని విస్మరించడం వల్లే సమస్య తలెత్తిందని గుర్తుచేశారు.

English summary
ycp mla rk roja angry on ex minister Atchem Naidu on ap local body election postpone issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X