వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి సినిమాలా వైఎస్ జగన్ పాలన: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై రోజా సెటైర్లు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.

'బ్రీఫ్‌డ్ మీ’ అని చంద్రబాబు తెలుగును చంపేశారు: పవన్ కళ్యాణ్‌పైనా రోజా సెటైర్లు'బ్రీఫ్‌డ్ మీ’ అని చంద్రబాబు తెలుగును చంపేశారు: పవన్ కళ్యాణ్‌పైనా రోజా సెటైర్లు

చిరంజీవి సినిమాతో పోలుస్తూ..

చిరంజీవి సినిమాతో పోలుస్తూ..

అంతేగాక, సీఎం వైఎస్ జగన్ ఆరు నెలల పాలనపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్‌తో పోల్చారు. సీఎం వైఎస్ జగన్ ఆరు నెలల పాలనను చూసి ప్రజలు ‘సై సైరా నరసింహా రెడ్డి' అంటున్నారని రోజా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిన్నమెదడు..

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిన్నమెదడు..

అయితే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రం చిన్నమెదడు చితికిపోయినట్లు మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. అందుకే ఇసుక, ఇంగ్లీష్ మీడియం విషయంలో వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మతమార్పిడులు చేస్తున్నారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

బినామీల కోసమే చంద్రబాబు బాధ..

బినామీల కోసమే చంద్రబాబు బాధ..

చంద్రబాబు బాధ తెలుగు కోసం కాదు.. ప్రజల కోసం కాదు.. తన బినామీల స్కూళ్లు మూతపడతాయని భయమని రోజా ఎద్దేవా చేశారు. అంతేగాక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 20-30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని రోజా వ్యాఖ్యానించారు.

ఈ రాబడి ఎవరి జేబుల్లోకి బాబూ అంటూ విజయసాయి..

ఈ రాబడి ఎవరి జేబుల్లోకి బాబూ అంటూ విజయసాయి..


ఇది ఇలావుంటే, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ. 63 కోట్ల ఆదాయం వచ్చింది. ఏడాది అంత చూస్తే ఇది వేల కోట్లకు వెళ్తుంది. మరి ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్లింది చంద్రబాబు అంటూ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

దేశంలోని ప్రప్రథమంగా..

దేశంలోని ప్రప్రథమంగా..

పచ్చ ఇసుక మాఫియా ద్వారా ఇన్నాళ్లు మీకు వాటా ముట్టిందని, అందుకే ఇసుక కొరతపై ఇంత రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. ‘దేశంలోనే ప్రప్రథమంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం గారు 14400 కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇటువంటి సాహసం ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయలేక పోయింది. ఎవరు లంచం అడిగినా, డబ్బులివ్వందే పని జరగదని చెప్పినా ఫోన్ చేయొచ్చు. చెప్పడమే కాదు చేసి చూపారు వైఎస్ జగన్ గారు' అని విజయసాయి వ్యాఖ్యానించారు.

English summary
YSRCP MLA RK Roja compares ys jagan's administration to chiranjeevi cinema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X