చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త సెల్వమణితో కలిసి కొత్త ఇంట్లో అడుగుపెట్టిన రోజా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం నూతన గృహ ప్రవేశం చేశారు. తన భర్త సెల్వమణితో కలిసి సంప్రదాయబద్దంగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను రోజా తన ఫేస్‌బుక్ ఖాతాలో పంచుకున్నారు.

నగరిలోనే మకాం: నిర్మాణంలో రోజా కొత్త ఇల్లు ఇదే(పిక్చర్స్) నగరిలోనే మకాం: నిర్మాణంలో రోజా కొత్త ఇల్లు ఇదే(పిక్చర్స్)

కొత్త ఇంటి ఫొటోలు..

కొత్త ఇంటి ఫొటోలు..

గృహ ప్రవేశ సందర్భంగా భర్త సెల్వమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రోజా.. తన కొత్త ఇంటి ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె అభిమానులు లైక్స్ కొట్టి అభినందనలు తెలుపుతున్నారు.

గత ఏడాది పనులు ప్రారంభం

గత ఏడాది పనులు ప్రారంభం

కాకా, రోజా తన సొంత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో నగరిలోనే సొంత ఇల్లు నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం అక్టోబర్‌లో న‌గ‌రిలో త‌న ఇంటి నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించగా, ఇప్పటికి పూర్తవడంతో శుక్రవారం గృహ ప్రవేశం చేశారు.

ఎన్నికల దగ్గరపడుతుండటంతో..

ఎన్నికల దగ్గరపడుతుండటంతో..

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కాలమే ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు రోజా అందుబాటులో ఉండాలని సొంతింటి ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. సొంత ఇల్లు ఉంటే ఎక్కువ సమయం ఇక్కడ ఉండే అవకాశం ఉంటుందని ఆమె భావించినట్లు తెలుస్తోంది.

సాంప్రదాయ బద్దంగా..

సాంప్రదాయ బద్దంగా..

ఈ గృహ ప్రవేశ కార్యక్రమానికి రోజా బంధువులు, పలువురు స్థానిక మహిళలు హాజరయ్యారు. ఓ వైపు జబర్దస్త్ లాంటి టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. మరో వైపు పార్టీ కార్యక్రమాల్లోనూ రోజా చురుగ్గా పాల్గొంటున్నారు.

English summary
YSR Congress Party MLA RK Roja on Friday entered in to a new house in Nagari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X