హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha case encounter:వణుకుపుట్టాలి: దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై రోజా స్పందన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ హర్షణీయమని ఆమె అన్నారు.

disha case encounter: చట్టం తన పని తాను చేసింది: ఎన్ కౌంటర్‌పై సీపీ సజ్జనార్ కీలక విషయాల వెల్లడిdisha case encounter: చట్టం తన పని తాను చేసింది: ఎన్ కౌంటర్‌పై సీపీ సజ్జనార్ కీలక విషయాల వెల్లడి

హర్షాతిరేకాలు..

హర్షాతిరేకాలు..

నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమవడంతో దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఆమె అన్నారు. దిశ కేసు విచారణలో భాగంగా సంఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారని.. దీంతో పోలీసులు కాల్పులు జరిపడంతో మృతి చెందారని రోజా తెలిపారు.

వణుకుపుట్టాలి..

వణుకుపుట్టాలి..

సమాజంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు రోజా. ఆడపిల్లలను ఒక వస్తువుగా చూడటం సరికాదని ఆమె అన్నారు. మహిళలను అసభ్యకరంగా తాకినా, అనుచితంగా ప్రవర్తించినా కఠిన శిక్షలు పడతాయన్న భయంతో వణుకు పుట్టేలా చట్టాలు ఉండాలని రోజా వ్యాఖ్యానించారు.

కనివిప్పు కలగాలి..

కనివిప్పు కలగాలి..

నమోదయ్యే కేసులు కొన్నేనని.. నమోదు కాని కేసులు ఇంకా ఎన్నో ఉంటున్నాయని రోజా తెలిపారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడినా.. రాజకీయ ప్రోద్బలంతో, పోలీసుల అండతో బయటికి రావచ్చనుకుంటున్న వారికి కనువిప్పు కలుగుతుందని రోజా అన్నారు .

దాడి చేయడంతో ఎన్‌కౌంటర్..

దాడి చేయడంతో ఎన్‌కౌంటర్..

కాగా, దిశను అత్యారం చేసి, హత్య చేసిన కేసులో నిందితులు మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివను శుక్రవారం తెల్లవారుజామున దిశ హత్య జరిగిన చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లారు పోలీసులు. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన సెల్‌ఫోన్, వాచీ, పవర్ బ్యాంక్ పాతిపెట్టిన ప్రదేశాలను చూపించారు. ఈ సమయంలోనే నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడి చేశారు. అంతేగాక, పోలీసుల దగ్గర్నుంచి తుపాకీలను లాక్కున్నారు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు. లొంగిపోవాలంటూ పోలీసులు కోరినప్పటికీ నిందితులు వినకుండా కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి నలుగురు నిందితులను మట్టుబెట్టారు. నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఓ ఎస్ఐ, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వారు హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు వివరాలను సీపీ సజ్జనార్ శుక్రవారం సాయంత్రం మీడియాకు తెలియజేశారు.

English summary
YSRCP MLA RK Roja on disha accused encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X