వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సచివాలయంలో ఆత్మహత్య: సీఎం అపాయింట్‌మెంట్ కోసం వచ్చి..

పురుగుల మందు తాగి అతను ఆత్మహత్యకు యత్నించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: తన బాధలను సీఎంకు చెప్పుకుందామని వచ్చిన ఓ వైద్యుడు ఆయన అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో ఈ ఘటన కలకలం సృష్టించింది.

Suicide

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని రాజగోపాల్ అనే ఆర్ఎంపీ వైద్యుడిగా గుర్తించారు. అప్పుల బాధలో కూరుకుపోయిన రాజగోపాల్.. తన కష్టాల గురించి సీఎంకు విన్నవించుకుందామని సచివాలయానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచిచూసినా.. అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు.

ఇక చేసేదేమి లేక ఆత్మహత్యే శరణ్యం అనుకున్న అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నించాడు. సచివాలయంలోనే అతను ఈ చర్యకు పాల్పడటంతో సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు రాజగోపాల్ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. రాజగోపాల్ స్వస్థలం నెల్లూరు జిల్లా అని అధికారులు తెలిపారు.

English summary
Rajagopal, A RMP director committed suicide at AP Secretariat. On saturaday early morning he was died
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X