వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ కోసం... గురువు ప్రశాంత్ కిషోర్ కి పోటీగా రంగంలోకి దిగిన శిష్యుడు రాబిన్ శర్మ

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత ఎన్నికల సమయంలో ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. చరిత్రలోనే లేనివిధంగా టి.డి.పి ఓటమి పాలు కావడం చంద్రబాబు నాయుడుకు, అటు టీడీపీ శ్రేణులకు పెద్ద షాక్ అని చెప్పాలి. ఇక వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుండే పావులు కదుపుతుంది. అధికారపార్టీ ఒత్తిడిని అధిగమించి, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ఒక సృష్టమైన ప్రణాళికతో ముందుకి వెళ్తుంది.

నాడు బాబు బినామీ నేడు సచ్చీలుడా... టీటీడీలో స్థానమా... జగన్ పై జనసేన ఫైర్నాడు బాబు బినామీ నేడు సచ్చీలుడా... టీటీడీలో స్థానమా... జగన్ పై జనసేన ఫైర్

 వైసీపీ విజయానికి కృషి చేసిన పీకే .. టీడీపీ కోసం పని చెయ్యాలని ఆఫర్

వైసీపీ విజయానికి కృషి చేసిన పీకే .. టీడీపీ కోసం పని చెయ్యాలని ఆఫర్

అయితే గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలు ఉపయోగించుకోవాలని టీడీపీ నిర్ణయించుకుంది. ఎన్నికల్లో జగన్ పార్టీ ఊహించని విజయం సాధించటం లో, అంత వ్యూహాత్మంగా అడుగులు వెయ్యటంలో ప్రశాంత్ కిశోర్ పాత్ర ఎవరూ కాదనలేనిది .ఈ విషయం అందరికీ తెలిసిందే. మూడేళ్లుగా ప్రశాంత్ కిశోర్ టీం.. వైసీపీ కోసం పనిచేసి ఊహించని సక్సే ను అందించింది. అందుకే ఎన్నికల తర్వాత తమ పార్టీ కోసం పని చేయాలని టీడీపీ ప్రశాంత్ కిషోర్ తో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం.

జగన్ పార్టీకి అనుబంధంగానే నేటికీ పీకే సేవలు

జగన్ పార్టీకి అనుబంధంగానే నేటికీ పీకే సేవలు

ప్రశాంత్ కిషోర్ కి ఇంకా జగన్ పార్టీకి పనిచేసే ఒప్పందం ఉండటం వలన టీడీపీకి పనిచేయటానికి ఆయన ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ ను తమ పార్టీ పనితీరును, తమ ప్రభుత్వ పనితీరును తెలియజేసే విధంగా, ప్రజల్లోకి తమ ప్రభుత్వం వెళ్ళే విధంగా, ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా పనిచేయాలని కోరడంతో పీకే ప్రస్తుతం జగన్ కోసమే పని చేస్తున్నారు.

పీకే కి పోటీగా శిష్యుడు రాబిన్ శర్మను రంగంలోకి దింపిన టీడీపీ

పీకే కి పోటీగా శిష్యుడు రాబిన్ శర్మను రంగంలోకి దింపిన టీడీపీ

పీకే టీడీపీ కోసం పని చెయ్యటానికి నిరాకరించటంతో టీడీపీ ప్రశాంత్ కిషోర్ స్థానంలో మరొకరి కోసం ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఒక్కప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ లో పనిచేసిన మానేసిన రాబిన్ శర్మను టిడిపి కోసం పనిచేసేందుకు నియమించుకుంది అని తెలుస్తోంది . ఇక రాబిన్ శర్మ విషయానికి వస్తే ఆయన ప్రశాంత్ కిషోర్ టీం నుండి బయటకు వచ్చిన తర్వాత సొంతగా ఒక పొలిటికల్ సర్వే సంస్థని ఏర్పాటు చేసుకుని దానిని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది . అతనితో టీడీపీ భారీ స్థాయిలోనే ఒప్పందం చేసుకుందని సమాచారం.

టీడీపీ ప్రచార బాధ్యతలను చేపట్టిన రాబిన్ శర్మ

టీడీపీ ప్రచార బాధ్యతలను చేపట్టిన రాబిన్ శర్మ

పార్టీ కోసం పని చేయడానికి రాబిన్ శర్మ కు దాదాపు 50 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తుంది. ఇక టీడీపీ ప్రచార బాధ్యతలను చేపట్టిన రాబిన్ శర్మ టీడీపీకి సంబంధించిన ప్రతి విషయాన్ని మీడియాకి అందించటం, వాటికి తగ్గ ప్రమోషన్ చేయటం, జాతీయ స్థాయిలో టీడీపీకి కవరేజ్ దొరికేలా చేయటంలో సహాయం చేస్తున్నాడని తెలుస్తుంది. రాజకీయ చతురుడిగా పేరున్న గురువు ప్రశాంత్ కిషోర్ కి పోటీగా నిలబడి టీడీపీ కోసం పని చేస్తున్న రాబిన్ శర్మ టీడీపీకి అధికారం అందేలా చేయటంలో ఎలాంటి పాత్ర పోషిస్తాడో చూడాలి.

పీకే రాజకీయ వ్యూహాలు తెలుసు కాబట్టే రాబిన్ శర్మకు అవకాశం

పీకే రాజకీయ వ్యూహాలు తెలుసు కాబట్టే రాబిన్ శర్మకు అవకాశం

పీకే రాజకీయ వ్యూహాలను దగ్గర నుండి చూసిన వ్యక్తి కాబట్టే రాబిన్ శర్మ ను తీసుకుంటే పీకే వ్యూహాలను సమర్ధంగా తిప్పికొట్టే చాన్స్ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్న నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఎవరికీ అంతు చిక్కని విధంగా వ్యూహాలు రచించే పీకేని తట్టుకుని రాబిన్ శర్మ టీడీపీకి విజయం అందిస్తారా అన్నది పక్కన పెడితే ఇప్పటి నుండి టీడీపీపై ప్రజల్లో ఒక సానుకూల దృక్పధాన్ని కలిగించాలని ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారు.

English summary
It is reported that Prashant Kishore rejected to work for TDP , so TDP hired Robin Sharma, who worked on the iPad, with PK. When it comes to Robin Sharma, seems to have set up his own political survey organization after leaving the Prashant Kishore team. It is reported that the TDP deal with him on a large package .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X