హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోహిత్ సూసైడ్: అవార్డు వెనక్కిచ్చిన వాజపేయి, ఎఫ్ఐఆర్‌లో దత్తాత్రేయ పేరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో అశోక్ వాజపేయి అనే రచయిత తన అవార్డును వెనక్కి ఇచ్చారు. హెచ్‌సియు తనకు ఇచ్చిన డీ.లిట్ అవార్డును ఆయన మంగళవారం నాడు వెనక్కి ఇచ్చారు.

Photos: హెచ్‌సియూలో రాహుల్ గాంధీ

రోహిత్ మృతి ఎఫ్‌ఐఆర్‌లో దత్తాత్రేయ పేరు

హెచ్‌సియూలో రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య కేసులో ఎఫ్‌ఐఆర్ కాపీ ఒక మీడియా సంస్థకు చిక్కింది. ఎఫ్‌ఐఆర్‌లో హెచ్‌సీయూ వీసీ, ఇద్దరు ఏబీవీపీ నేతలతోపాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్ర రావు పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది.

Rohith Vemula suicide in campus: Ashok Vajpayee returns award

అసదుద్దీన్ సంఘీభావం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ అనే విద్యార్థి అనుమానాస్పద మృతితో వర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ మేరకు వర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ధర్నాకు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంఘీభావం తెలిపారు.

ఆయన మంగళవారం వర్సిటీకి వెళ్లి విద్యార్థులను అడిగి సంఘటనా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వర్సిటీ వీసీ అప్పారావుకు వీసీ పదవిలో కొనసాగే నైతిక అర్హతలేదని, వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలన్నారు. ఈ ఘటనలో కేంద్ర మంత్రుల ప్రమేయం ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
Ashok Vajpayee returns his award after Rohith Vemula suicide in campus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X