వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఫోటోపై చెత్త వేశారని, నారాయణ-గంటాలను తొలగించండి: రోజా

కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం ఘాటుగా స్పందించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం ఘాటుగా స్పందించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

వైసిపిలో విభేదాలు, పార్టీ ఆఫీస్‌లో ఫర్నీచర్ ధ్వంసం: జగన్‌పై గుర్నాథ్ రెడ్డి ఆగ్రహం!వైసిపిలో విభేదాలు, పార్టీ ఆఫీస్‌లో ఫర్నీచర్ ధ్వంసం: జగన్‌పై గుర్నాథ్ రెడ్డి ఆగ్రహం!

కాసుల కోసం ఎంతమందిని బలి తీసుకుంటారని నిలదీశారు. కార్పోరేట్ కాలేజీలపై తల్లిదండ్రులు ఎదురు తిరగాలని సూచించారు. ఆత్మహత్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం బాధ లేదన్నారు. 40 మంది పిల్లలు చనిపోయినా చర్యలు లేవన్నారు.

Roja demands for Ganta and Narayana dismess

నారాయణ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. విశాఖపట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిందిత కాలేజీపై ఏ చర్యలు తీసుకున్నారన్నారు.

ఆగండి! పార్టీ మారడంపై అన్నీ చెబుతా: బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలుఆగండి! పార్టీ మారడంపై అన్నీ చెబుతా: బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలు

దీనికి కారణమైన నారాయణ, చైతన్య కాలేజీల యాజమాన్యాలకు ఏ శిక్షలు విధించారన్నారు. విద్యాశాఖ మంత్రి పట్టించుకోవడం లేదన్నారు. కేవలం వియ్యంకుడు అన్న కారణంతో గంటా శ్రీనివాస రావు.. మంత్రి నారాయణను రక్షిస్తున్నారన్నారు.

కేవలం చంద్రబాబు ఫోటో పైన చెత్త వేశారని ఐఏఎస్ అధికారిణితో విచారణకు ఆదేశించారని, మరి పిల్లల జీవితాలను హరిస్తున్న నారాయణ, చైతన్యలపై విచారణకు ఎలాంటి సంఘాన్ని ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. కేబినెట్ నుంచి గంటాను, నారాయణలను తొలగించాలని డిమాండ్ చేశారు.

English summary
Andhra Pradesh YSR Congress party Nagari MLA Roja demanded for Ministers Ganta Srinivas Rao and Narayana dismiss.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X