• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇదీ జగన్, నవ్వుతారేమో: రోజా చెప్పిన నిజాలు! 'ఒక్కొక్కడ్ని ఆడుకుంటామని అంటాడు'

|

అమరావతి: గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా ఆఖరి శ్వాసవరకూ జై జగన్ అంటూనే ఉంటానని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ వ్యాఖ్యలను పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి పరాజయం నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నంద్యాల ఫలితం వెలువడ్డాక రోజాపై సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల ప్రచారం సాగింది. వీటికి సమాధానంగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

అదే సమయంలో జగన్ పైన వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫేస్‌బుక్‌లో రోజా పెట్టిన పోస్ట్ ఇదే...

మీకు రాజకీయ చదరంగం తెలియదు కాబట్టి

మీకు రాజకీయ చదరంగం తెలియదు కాబట్టి

'నా ఫేస్‌బుక్ పేజీలో సుమారు కొన్ని వేలమందికి పైగా రాజకీయాలకు సంబంధం లేని తటస్తులు ఉన్నారు. మీరు ఇప్పటి వరకు జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడని, నేరం రుజువు అయ్యి జైలు శిక్ష అనుభవించాడని కొన్ని పేపర్లు చదివి కొన్ని చానెల్స్ చూసి తెల్సుకున్నారు. మీకు రాజకీయ చదరంగం రాజకీయ వ్యభిచారం తెలియదు కాబట్టి అవన్నీ నిజమే అని నమ్మొచ్చు. కానీ మీకు కొన్ని విషయాలు విన్నవించుకుంటున్నాను.' అని రోజా తొలుత పేర్కొన్నారు.

  MLA Roja and YS Jagan Got Insulted by TDP Govt - Oneindia Telugu
  ఆ దేవుళ్లు దెయ్యాలయ్యేవారు.. జగన్ అంతే

  ఆ దేవుళ్లు దెయ్యాలయ్యేవారు.. జగన్ అంతే

  'మీకు తెలిసిన విషయాల ప్రకారమే మీకు ఆ అభిప్రాయం కలిగింది. జగన్ గురించి మీ మనసులో ఉన్న ప్రతి వ్యతిరేక అభిప్రాయం మీ సొంతంగా కలిగింది కాదు. చంద్రబాబుకి సంబంధించిన సుమారు 18 ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా కలిసి మీ చెవిలో డప్పు కొట్టి మిమ్మల్ని హిప్నోటైజ్ చేసిన అభిప్రాయాలు అవి. ఒక్క విషయం కచ్చితంగా చెప్పగలను. జగన్ గురించి మీలో కొందరికి ఉన్న వ్యతిరేక అభిప్రాయం కన్నా వాస్తవంగా జగన్ ఏంటో 1 శాతం కూడా తెలియదు. మనకు లభించిన మత గ్రంథాల రచయితలు రాముడు, కృష్ణుడు, క్రీస్తు, అల్లా గురించి పాజిటివ్‌గా రాసారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. అదే వ్యతిరేకంగా రాస్తే ఆ దేవుళ్ళే దెయ్యాలయ్యేవారు. జగన్ విషయంలో కూడా అదే జరిగింది.' అని రోజా పేర్కొన్నారు.

  జగన్‌ను దుర్మార్గుడిగా చూపించారు

  జగన్‌ను దుర్మార్గుడిగా చూపించారు

  'రాష్ట్రంలోని 99% జగన్ వ్యతిరేక వార్తా చానెల్స్ అన్ని కలిసి జగన్‌ని మీకు ఒక దుర్మార్గుడుగా అవినీతిపరుడిగా చూపించాయి. మీ కళ్ళకి ఏమి కనిపించిందో మీ చెవులకు ఏమి వినిపించిందో మీరు అదే నమ్మారు. మీకు నా విన్నపం ఒక్కటే.... మీ నమ్మకాన్ని మీరు నమ్మండి. కానీ ఆ నమ్మకం నిజమైనదో కాదో ఒక్కసారి కళ్ళెదురుగా సాక్షమిచ్చే వాస్తవాలను మీ నమ్మకాలతో బేరీజు వేసుకోండి.' రోజా అన్నారు.

  మీకు ఇవి చెప్పదల్చుకున్నా

  మీకు ఇవి చెప్పదల్చుకున్నా

  'జగన్ అంటే ఇది అని రుజువు చేసే మిమ్మల్ని... అంతగా ప్రభావితం చెయ్యని, జగన్ మీద సానుకూల దృక్పథం ఏర్పరిచే, వార్తా చానెల్స్ చూపించని కొన్ని విషయాలను మాత్రమే మీకు చెప్పదలుచుకున్నాను.' అని రోజా పేర్కొన్నారు.

  విశ్లేషించాక జగన్ మడమ తిప్పడు

  విశ్లేషించాక జగన్ మడమ తిప్పడు

  (1) జగన్ ఒక విషయాన్ని విశ్లేషించి నిర్ణయానికి వచ్చాక ప్రాణం పోతుంది అనుకున్నా మడమ తిప్పడు

  (A) వైఎస్సార్‌ను అభిమానించే వారి కోసం సోనియాని ఎదిరించి జైలు శిక్ష అనుభవించాడు.

  (B) కొన్ని నియోజకవర్గాల్లో ఓడిపోతాం అని తెలిసినా మాట తప్పకూడదు అన్న నియమంతో టికెట్లు మార్చలేదు.

  మీకు నవ్వు తెప్పించొచ్చు

  మీకు నవ్వు తెప్పించొచ్చు

  (2) జగన్ నిజాయితీపరుడు {ఈ మాట మీకు నవ్వు తెప్పించొచ్చు. ఎందుకంటే మీకు తెలిసినంతవరకు ఇది అబద్దం... కానీ వాస్తవాలు చూడండి....

  (A) భారతదేశంలోనే ముందస్తు పన్ను చెల్లించిన ఏకైక వ్యక్తి జగన్

  (B) భారతదేశంలో నిజాయితీగా పన్ను చెల్లించిన వ్యక్తుల్లో జగన్ మూడవ వాడు.. రాజకీయనాయకులలో మొదటివాడు.

  (C) అతి తక్కువకాలంలో ఎక్కువ నాణ్యతతో దేశంలోనే దిగ్గజాల సరసన చేరిన గొప్ప పారిశ్రామికవేత్త జగన్.

  (D) జగన్‌కి సంబంధించిన భారతి సిమెంట్ కంపెనీ ప్రపంచ స్థాయిలో అవార్డు గెలుచుకుంది

  నీతిమంతుడు

  నీతిమంతుడు

  (3) జగన్ నీతిమంతుడు

  (A) జగన్ వ్యతిరేకులు ప్రచారం చేసినట్లు జగన్ ప్రజాజీవితంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆ ప్రచారాల తాలుకా ఏ ఒక్క గుణం కనిపించలేదు. పైగా లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే వ్యాపారాలను వదులుకొని 5 సంవత్సరాలుగా ప్రజల మధ్యే గడుపుతున్నాడు. అంత అవినీతిపరుడు అయితే అదే కాంగ్రెస్ మద్దతుతో కేంద్ర మంత్రో ముఖ్యమంత్రో అయ్యి మరో అంబానీ అయ్యేవాడు.

  (B) పచ్చ వార్తల ప్రకారం జగన్ అంత దారునమైన వ్యక్తి అయితే... పదవి కోసం చంద్రబాబులా రుణమాఫీ వాగ్దానం ఇచ్చేవాడు.

  (C) జగన్ నీతిమంతుడు కాకపోతే కోట్లు చిమ్మి డబ్బుతో అబద్ద వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయ్యేవాడు

  గొప్ప నాయకుడు

  గొప్ప నాయకుడు

  (4) జగన్ గొప్ప వ్యక్తి... ప్రజా నాయకుడు

  (A) జగన్ గొప్ప నాయకుడు కాబట్టే దేశంలో ఏ నాయకుడు ఇప్పటివరకు అతి తక్కువ కాలంలో దేశంలో ఏ నాయకుడు చెయ్యనన్ని ఉద్యమాలు, దీక్షలు చేశాడు.

  (B) జగన్ ప్రజా నాయకుడు కాబట్టే అధికారం కోసం పవన్ కళ్యాణ్, మోడీ, సినిమావాళ్ళు, డబ్బు అబద్ద వాగ్ధానాలు, రాజకీయ వ్యభిచారం, ఎన్నికల మ్యానేజ్మెంట్ చెయ్యకుండా నిజాయతీగా ప్రజలకోసం ఓడిపోయాడు.

  (C) జగన్ నీతిమంతుడు కాబట్టే అధికారం కోసం కిరణ్ సర్కారుని కూల్చకుండా అధికారం కోసం అందరి కాళ్ళు పట్టుకోకుండా నిజమైన తీర్పు కోసం ప్రజలవద్దకు వెళ్ళాడు.

  జగన్ సై అంటే ఒక్కొక్కడ్ని ఆడుకుంటామని నాని చెబుతుంటాడు

  జగన్ సై అంటే ఒక్కొక్కడ్ని ఆడుకుంటామని నాని చెబుతుంటాడు

  (5) జగన్ నికార్సైన వ్యక్తి... జగన్ మేధావి

  (A) ఎన్నికల్లో ఓటర్లను కొనటానికి ఓ పెద్ద సంస్థ వంద కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తాం అన్నా జగన్ నవ్వుతూ తిరస్కరించాడు.

  (B) ఇప్పటివరకు ఉన్న రాజకీయ సంస్కృతిని చెరిపేసి జగన్ ఒక కొత్త సంస్కృతిని రాజకీయాల్లో చేర్చాడు. రాజకీయ కక్షలు రాజకీయ ఎదురు దాడులు కాకుండా నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తున్నాడు. (కావాలంటే వైసిపి నాయకుల మాటలు ప్రెస్ మీట్లు వ్యవహార శైలి గమనించండి. అదే పక్క టిడిపి శైలి గమనించండి. కొడాలి నాని చెప్తుంటాడు జగన్ సై అంటే ఒక్కొక్కన్ని ఆడుకుంటాం అని)

  (C) యుద్దరంగం లాంటి అసెంబ్లీలో రాజకీయ చాతుర్యం అయిన ఎదురుదాడి పద్మవ్యూహాలు కాకుండా... ప్రభుత్వపు వ్యక్తిగత దూషణలు, దాడులను పట్టించుకోకుండా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి గొప్పవారిని తలపించే విధంగా సబ్జెక్ట్ మాట్లాడుతూ ఒక కొత్త సంస్కృతిని ప్రవేశ పెట్టాడు.

  సరిగ్గా చెప్పలేకపోయా

  సరిగ్గా చెప్పలేకపోయా

  'నేను చెప్పదలుచుకున్నవి సరిగా చెప్పలేకపోయాను. అందులో కూడా కొన్ని అంశాలను మాత్రమే చెప్తున్నాను. ఇప్పటికీ జగన్ విషయంలో మీ దృక్పదం మారకపోతే.. వాస్తవంగా జగన్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకోలేకపోతే మీ విజ్ఞతకే వదిలేస్తున్నా' అని రోజా పేర్కొన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Firebrand actress-turned-YSR Congress party legislator R K Roja, known for her loud-mouth and aggressive comments against the rivals, went into a shell soon after the results for Nandyal by-election were announced on Monday afternoon.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more