వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబు లో ఎందుకీ అస‌హ‌నం : ఆ ఇద్ద‌రినీ ప‌క్క‌నే పెట్టుకున్నారు : రోజా ఫైర్..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ల‌క్ష్యంగా వైసిపి ఎమ్మెల్యేల రోజా తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. ముఖ్య‌మంత్రికి అస‌హ‌నం పెరి గి పోయింద‌ని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ను సినీ నటుడు నాగార్జున కలిస్తే ఓర్వలేకపోతున్నారని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు మాట‌ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌ని రోజా వ్యాఖ్యానించారు.

చంద్ర‌బాబు ఓర్వలేక‌పోతున్నారు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అసహనం పెరిగిపోయిందని అందుకే.. వైఎస్‌ జగన్‌ను సినీ నటుడు నాగార్జున కలిస్తే ఓర్వలేకపోతున్నారన్నారు. నేర చరిత్ర కలిగిన వారిని పక్కన పెట్టుకుం ది చంద్రబాబేనని, సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనదేనని విమర్శించారు. చంద్రబాబుపై 18 కేసు లు ఉన్నా... నేటికి విచారణకు హాజరు కాకుండా తిరుగుతున్నారన్నారు. ఇంట్లో బాంబులు పేల్చిన కోడెల శివప్రసాద రావు, గన్‌ పేల్చిన బాలకృష్ణను పక్కన పెట్టుకుంది చంద్రబాబు కాదా..అని రోజా ప్రశ్నించారు.

Roja Fire on Chandra Babu : CM is in Frustration..!

కుట్ర‌ల‌తో జ‌గ‌న‌జ్ పై కేసులు..
కాంగ్రెస్‌, టీడీపీ కుమ్మక్కై వైఎస్‌ జగన్‌పై కుట్రపూరితంగా కేసులు పెట్టాయన్నారు. అయినా వైఎస్‌ జగన్‌ విచారణకు హాజరై అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుంది చంద్రబాబేనని, అందుకే ఆపరేషన్‌ గరుడ ప్లాన్‌తో వైఎస్‌ జగన్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఐదేళ్లుగా చంద్ర బాబు ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నారో ప్రజలు గమనిస్తున్నారని, ఆయన మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు. అలాగే రౌడీ చింతమనేనికి విప్ పదవి ఇచ్చి జనాలపై వదిలారని, జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేకే హత్యాయత్నం చేశారని రోజా అన్నారు.

English summary
YCP Mla roja fire on Cm Chandra Babu and TDP leaders. Roja says CM in frustration. She also cornered Balakrsishna, chintameneni and Speaker siva prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X