వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ క్యాష్ అండ్ క్యాస్ట్ స్ట్రాటజీ ఇదే .. రాజ్యసభలో ఓటేసి.. టీడీపీపై రోజా ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా టిడిపి అధినేత చంద్రబాబుపై, టీడీపీ నాయకులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడంపై విమర్శనాస్త్రాలు సంధించిన రోజా టిడిపి కావాలనే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆమె ఆరోపించారు. తమకు బలం లేదని తెలిసి, గెలిచే సీన్ లేదని తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని విమర్శించారు. గతంలో టిడిపి తనకు మెజారిటీ ఉన్నప్పుడు క్యాష్ ను నమ్ము కుందని, ఇక లేనప్పుడు క్యాస్ట్ ను నమ్ముకుంటున్నదంటూ రోజా ఆరోపణలు గుప్పించారు.

 వారు నోరువిప్పుతారనే .. కుడితిలో పడ్డ ఎలుకల్లా చంద్రబాబు,లోకేష్ లు : రోజా ఫైర్ వారు నోరువిప్పుతారనే .. కుడితిలో పడ్డ ఎలుకల్లా చంద్రబాబు,లోకేష్ లు : రోజా ఫైర్

క్యాస్ట్ చూపిస్తూ టిడిపి నేతను రాజ్యసభ ఎన్నికల బరిలోకి దించారని రోజా మండిపడ్డారు. టీడీపీ నేత వర్ల రామయ్యను మరోసారి చంద్రబాబు బలిపశువును చేశారని ఆరోపించారు. నేడు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎమ్మెల్యేగా తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో ప్రవర్తించిన తీరుపై కూడా రోజా భగ్గుమన్నారు. టిడిపి శాసనమండలిలో వాపును చూసి బలుపు అనుకుంటుంది అని ఆమె వ్యాఖ్యలు చేశారు.

Roja Fire on TDP Cash and caste strategy .. during Rajya Sabha polling

ఇక మండలిలో 29 మంది ఉంటేనే అలా చేస్తే,అసెంబ్లీలో 151 మంది ఉన్న మేం ఏం చేయాలంటూ రోజా ప్రశ్నించారు. ఇక అంతేకాదు వైసీపీ నుంచి 25 మంది దళితులు ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఐదుగురిని జగన్ కేబినెట్ లోకి తీసుకున్నారని, సముచిత స్థానం ఇచ్చారని రోజా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అటు రాష్ట్రాభివృద్ధిలోనూ ఇటు కరోనా కట్టడిలోనూ మంచి విజన్ తో పని చేస్తున్నారని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సెల్వమణి సీఎం జగన్ ను కొనియాడారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై,తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు.

English summary
APIIC chairman Roja Selvamani outraged on Telugu Desam Party chief Chandrababu Naidu as well as tdp . She accused the TDP of contesting the Rajya Sabha elections knowing that it had no strength and no winning scene. Roja alleged that the TDP trusts Cash when it has strength, caste when it is weak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X