విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై దాడి కుట్రే, ఇవి చాలవా? శ్రీనివాస్ రూ.కోటితో భూమి బేరమాడాడు: రోజా ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

తిరుపతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన టీడీపీ కుట్రేనని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Recommended Video

జగన్‌పై దాడి ఆరోజే ఎందుకు? | Why Srinivas Rao Did That Attempt Ys Jagan on that day only?
 రూ. కోటితో భూమి బేరం చేసిన శ్రీనివాస్..

రూ. కోటితో భూమి బేరం చేసిన శ్రీనివాస్..

జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ కోటి రూపాయలతో భూమి కొనుగోలు చేసేందుకు బేరసారాలు ఆడాడని రోజా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. టీడీపీ నేతలు వెంటనే తమ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

<strong>జగన్‌పై దాడి ఆరోజే ఎందుకు?: మూడు నెలలుగా విశాఖ నుంచే, ఐనా ఎన్నడూ కలవని శ్రీనివాస్.! </strong>జగన్‌పై దాడి ఆరోజే ఎందుకు?: మూడు నెలలుగా విశాఖ నుంచే, ఐనా ఎన్నడూ కలవని శ్రీనివాస్.!

శివాజీ పారిపోయాడు.. కుట్రకు నిదర్శనాలివే..

శివాజీ పారిపోయాడు.. కుట్రకు నిదర్శనాలివే..


సినీ నటుడు శివాజీ పథకం ప్రకారమే అమెరికాకు పారిపోయాడని రోజా ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రుల తీరు చూస్తుంటే వెగటు వస్తోందని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించలేకపోతున్న నేతలు దాడికి గురైన వారిపైనే వెటకారంగా మాట్లాడటం సరికాదన్నారు. జగన్‌పై దాడి జరిగిన గంటలోనే నిందితుడు జగన్ అభిమాని అని డీజీపీ చెప్పడం, ఫ్లెక్సీని విడుదల చేయడం దాడి వెనుక కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోందని రోజా అన్నారు.

జగన్‌పై దాడి కేసు విచారణ వాయిదా..

జగన్‌పై దాడి కేసు విచారణ వాయిదా..

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన హత్యయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ మేరకు జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. విమానాశ్రయంలో భద్రతా లోపాలవల్లే జగన్‌పై హత్యాయత్నం జరిగిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌ మంగళవారం ధర్మాసనం ముందు విచారణకు రానున్న నేపథ్యంలో, స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోసం తన ముందు దాఖలైన వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతానని జడ్జి తెలిపారు.

 రక్షణ లేదంటూ.. గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

రక్షణ లేదంటూ.. గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై వినతిపత్రం ఇచ్చేందుకు సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లిన బీజేపీ నాయకులు.. జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం, తదనంతర పరిణామాలపై గవర్నర్‌తో చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని.. అన్ని ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలపై దాడులు జరుగుతున్నాయని గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలపై దాడి జరిగిందని, జగన్‌పై హత్యాప్రయత్నం జరిగిందని వివరించారు. ప్రతిపక్ష నాయకుడిపై హత్యాప్రయత్నం జరిగితే గవర్నర్‌ రాష్ట్ర డీజీపీని వివరాలు కోరడాన్ని కూడా ముఖ్యమంత్రి తప్పుబట్టడాన్ని బీజేపీ నేతలు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, నేతలపై దాడుల విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌ను వారు కోరారు.

English summary
YSRCP MLA RK Roja on Tuesday fired at Andhra pradesh CM Chandrababu Naidu and TDP for attack on YSRCP president Jaganmohan Reddy issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X