వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

104 గ్రహాల వెనుక ముగ్గురు: రోజా గర్వం, మా ఫ్యామిలీలో ప్రోత్సాహం ఎక్కువ: లోకేష్

ఇస్రో ఇటీవల 104 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించిందని, ఈ విజయం వెనుక ముగ్గురు మహిళా సైంటిస్టులు ఉండటం గర్వంగా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఇస్రో ఇటీవల 104 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించిందని, ఈ విజయం వెనుక ముగ్గురు మహిళా సైంటిస్టులు ఉండటం గర్వంగా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు.

ఎస్సీ హాస్టల్ విద్యార్థినులతో కలిసి రోజా మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వివక్ష లేని సమాజం వచ్చేంత వరకు ప్రతి మహిళ పోరాడాలన్నారు.

<strong>టిడిపితో ముచ్చెమటలు, వైయస్ ఫ్యామిలికీ ప్రతిష్ట: జగన్ అప్రమత్తం</strong>టిడిపితో ముచ్చెమటలు, వైయస్ ఫ్యామిలికీ ప్రతిష్ట: జగన్ అప్రమత్తం

బాల్య వివాహాలు, సెక్స్ రాకెట్, హత్యలు పెరుగుతున్నాయన్నారు. మహిళల పైన నేరాలకు మద్యం రాకాసే ప్రధాన కారణమని చెప్పారు.

 Roja and Nara Lokesh on Womens day

మా కుటుంబంలో ప్రోత్సాహం ఎక్కువ: లోకేష్

టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చాక వారికిఆస్తి హక్కు కల్పించారని, వారిని విద్యావంతులను చేయడం కోసం మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని చెప్పారు.

<strong>అభియోగాలు.. నాపై కేసు కొట్టి వేయండి: హైకోర్టుకు వైయస్ జగన్</strong>అభియోగాలు.. నాపై కేసు కొట్టి వేయండి: హైకోర్టుకు వైయస్ జగన్

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలను అభివృద్ధి చేసి మహిళలకు సాధికారత కల్పించారన్నారు. మహిళలు రాజకీయాల్లోకి వచ్చినా పురుషుల పెత్తనం ఉందన్నారు.

వారిని రాజకీయాల్లోనూ, వ్యాపారాల్లోనూ ప్రోత్సహించాల్సి అవసరం ఉందన్నారు. తమ కుటుంబంలో మహిళలకు ఎక్కువ ప్రోత్సాహం ఉందన్నారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణి వ్యాపారాల్లో ముందంజలో ఉన్నారన్నారు.

English summary
YSR Congress Party MLA Roja and TDP leader Nara Lokesh on womens day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X