వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి పదవి రేసులో రోజా,రజని,పిన్నెల్లి.?జగన్ మదిలో ఉన్నదెవరో.?ఏపీ రాజకీయం మరింత రసవత్తరం.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏదో ఒక అంశంతో వాడివేడిగా కొనసాగుతుంటాయి. ఇంగ్లీష్ మీడియం కానీ-ఇసుక వ్యవహారం గానీ, వైరస్ గానీ- వైన్ షాపుల వ్యవహారం గానీ, ప్రతిపక్షం గానీ-పథకాల అమలు గానీ, రాజధాని మార్పు కానీ-రంగుల వ్యవహారం గానీ, నిమ్మగడ్డ గానీ- పోతిరెడ్డి గాని, అసెంబ్లీ గానీ-అంగన్ వాడీ గానీ ఏపి సీఎం తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందడుగు వేస్తున్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ తనదైన శైలిలో ఏపి ప్రజలకు వైయస్ మార్క్ పాలన అందిస్తున్నట్టు పలు సందర్బాల్లో గుర్తు చేస్తున్నారు ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఖాళీ ఐన మంత్రి వర్గ స్ధానాల పట్ల, సీఎం అవకాశం కల్పించే అభ్యర్ధుల పట్ల అత్యంత ఉంత్కంఠ నెలకొంది.

ఏపిలో రెండు బెర్తులు ఖాళీ.. లాబీయింగ్ మొదలు పెట్టిన ఆశావహులు..

ఏపిలో రెండు బెర్తులు ఖాళీ.. లాబీయింగ్ మొదలు పెట్టిన ఆశావహులు..

ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని మంత్రివర్గంలో రెండు పదవులు ఖాళీ అయ్యాయి. మంత్రి పదవుల్లో కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఆ రెండు స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఆ రెండు మంత్రి పదవులు ఎవరితో భర్తీ చేస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. పార్టీలో కొందరు కీలక నేతలు ఆ మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరికి అనుకూలంగా ఉన్న కీలక నేతల వద్ద వారివారి లాబీయింగ్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపిలోని ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

విజయమ్మ, భారతి, సజ్జల, సాయిరెడ్డికి విజ్ఞప్తులు.. మంత్రివర్గంపై కన్నేసిన నేతలు..

విజయమ్మ, భారతి, సజ్జల, సాయిరెడ్డికి విజ్ఞప్తులు.. మంత్రివర్గంపై కన్నేసిన నేతలు..

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజినితో పాటు నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అంతే కాకుండా రాజధాని కేంద్రంగా ఉన్న గుంటూరుకు చెందిన ఓ ప్రముఖ నేత కూడా మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఎంపి విజయసాయి రెడ్డితో తనకు ఉన్న సాన్నిహిత్యం మేరకు ఇటీవల విశాఖ వెళ్లి తనకు మంత్రి పదవి కావాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి పదవి విషయంలో విజయసాయిరెడ్డి నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ సదరు నేతకు లభించలేదని సమాచారం.

రోజా, రజనీ మద్య తీవ్ర పోటీ.. ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న మాచర్ల ఎమ్మెల్యే

రోజా, రజనీ మద్య తీవ్ర పోటీ.. ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న మాచర్ల ఎమ్మెల్యే

దీంతో సదరు నేత వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతిని సంప్రదించి తనకు మంత్రి పదవి అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తాను పార్టీ సుధీర్ఘ కాలం కొనసాగుతున్న విషయన్ని కూడా భారతికి గుర్తుచేపసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జగన్ జైల్లో ఉన్న సమయంలో గుంటూరు జిల్లాలో పార్టీకి అండగా ఉండటంతో పాటుగా వైఎస్ కుటుంబానికి అండగా ఉన్నారు. అంతే కాకుండా జగన్ తల్లి వైయస్ విజయమ్మను కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని జగన్ ను కోరినట్లు తెలుస్తోంది. మరి జగన్ ఆయన మంత్రివర్గంలోకి చేర్చుకుంటారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Recommended Video

YSR Kapu Nestham Scheme Launched రాష్ట్ర వ్యాప్తంగా 2,37,873 మంది కాపు మహిళలకు రూ.15వేల ఆర్ధిక సాయం
జగన్ కరిణిస్తే సరిపోదు.. కరోనా కూడా కరుణించాలి.. అప్పుడే మంత్రివర్గ విస్థరణ అంటున్న విశ్లేషకులు..

జగన్ కరిణిస్తే సరిపోదు.. కరోనా కూడా కరుణించాలి.. అప్పుడే మంత్రివర్గ విస్థరణ అంటున్న విశ్లేషకులు..

అంతే కాకుండా పార్టీలో చేరిన మరుక్షణం నుండి మంచి ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న నగరి ఎమ్మెల్యే రోజా కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. మొదటి విడత విస్థరణలోనే తనకు బెర్తు ఖాయమని భావించిన రోజాకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం కాళీ ఐన బెర్తుల్లో ఒక స్ధానం తనకు కేటాయించాల్సిందిగా రోజా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో పాటు ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు వ్యవహరిస్తున్న విడుదల రజనీ కూడా మంత్రివర్గంలో చోటుకోసం తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం తనకు అనుకూలంగా ఉన్న సీనయర్ నేతలతో రజని మంతనాలు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇక మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా మంత్రి పదవి కోసం సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ నలుగురితో పాటు మరో నలుగురు నేతలు కూడా మంత్ర పదవికోసం ఆశలు పెట్టకున్నట్టు తెలుస్తోంది. ఐతే జగన్ కరుణించినా కరోనా కరుణించకపోతే మంత్రి వర్గ చేర్పులు ఆలస్యం అయ్యే అవకాశాలు లేకపోలేదనే చర్చ కూడా జరుగుతోంది.

English summary
Subhash Chandra Bose and Mopidevi Venkatramana, who continue to hold ministerial posts, have left vacant seats in the Rajya Sabha.Some key leaders of the party are reportedly making serious efforts for the ministerial posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X