• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ త్వరలో అన్నీ తెలుసుకుంటారు..అంతా మంచే జరుగుతుంది..కమీషనర్ అంశంలో రోజా రియాక్షన్..!

|

హైదరాబాద్/అమరావతి : నగరి మున్సిపల్ కమీషనర్ తొలగింపు అంశంలో ఎమ్మెల్యే రోజా ఆచితూచి స్పందించారు. కమీషనర్ కు, సీఎం జగన్ మోహన్ రెడ్డికి మధ్య తాను ఉన్నందున సస్పెన్షన్ వివాదం పట్ల చాలా సున్నితంగా వ్యవహరించారు. కమీషనర్ వెంకట్ రామి రెడ్డి తనకు సన్నిహితుడైనప్పటికి, తాను కాపాడే ప్రయత్నం చేయలేనని చెప్పుకొచ్చారు. చిన్న అంశం పక్కదారి పట్టిందని, మందలింపుతో సరిపోయే సందర్బం వేటు వేసేదాకా వెళ్లడం మాత్రం బాధాకరమని అభివర్ణించారు. జరిగిన వివాదంలో వాస్తవాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలో తెలుకుంటారని, అందరికి మంచే జరుగుతుందన్న ఆశాభావాన్ని నగరి ఎమ్మెల్యే రోజా వ్యక్తం చేసారు.

సీఎం జగన్‌కు హైకోర్టు భారీ జలక్...ఇంగ్లీష్ మీడియం బోధనకు బ్రేకులు..జీవోలు రద్దు

 నగరి మున్సిపల్ కమీషనర్ అంశంలో ఏమీ చేయలేను..

నగరి మున్సిపల్ కమీషనర్ అంశంలో ఏమీ చేయలేను..

ఏదైనా వివాదాస్పద అంశాన్ని అతి సున్నితంగా డీల్ చేయడంలో ఎమ్మెల్యే రోజాకు జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది. సహజంగా సాహసోపేత నిర్ణయాలతో వైసీపిలో ఫైర్ బ్రాండ్ గా ముద్రవేసుకున్నారు రోజా. సాధారణ ఎన్నికల్లో నగరి నియోజక వర్గం నుండి గెలుపొందిన తర్వాత రోజాకు మంత్రి వర్గంలో బెర్తు ఖాయమని, హోంమంత్రి పదవికి తానే సరైన అభ్యర్ధి అని అప్పట్టో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రజా సమస్యల పట్ల రోజా స్పందించే విదానం, ముఖ్యంగా మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల ఆమె రియాక్షన్ ప్రజామోదయోగ్యంగా ఉంటుందని ప్రజల్లో ఓ అంచనా మాత్రం ఉండేది.

 చిత్తూరు జిల్లాలో ఎదురులేని నేతగా దూసుకెళ్తున్న జబర్దస్త్ జడ్జ్..

చిత్తూరు జిల్లాలో ఎదురులేని నేతగా దూసుకెళ్తున్న జబర్దస్త్ జడ్జ్..

ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న రోజా.. చిత్తూరు జిల్లాలో ఎదురులేని నేతగా దూసుకెళ్తున్న జబర్దస్త్ జడ్జ్..

కాని ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి రోజాకు నామినేటెడ్ పదవిని కట్టబెట్టడం రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజానికానికి విస్మయాన్ని కలిగించింది. తన పదవిని సమర్దవంతంగా నిర్వహించడమే కాకుండా చిత్తూరు జిల్లాలో ప్రజాహిత కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా అంటే రోజా, రోజా అంటే చిత్తూరు జిల్ల అనేంతగా రోజా దూకుడు పెంచేసారు. తాజాగా కరోనా వైరస్ క్లిష్ట సమయంలో కూడా రోజా తన మార్క్ ను చాటుకుంటున్నట్టు తెలుస్తోంది. తన నియోజక వర్గంలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు రోజా. రేషన్ కార్డు లేని వారికి, ప్రభుత్వ రాయితీలు అందుకోలేని వారికి అండగా ఉండేదుకు ప్రయత్నిస్తున్నారు రోజా.

 మందలింపుతో సరిపోయే అంశం సస్పెన్షన్ దాకా వెళ్లింది.. అంతా మంచే జరుగుతుందన్న రోజా..

మందలింపుతో సరిపోయే అంశం సస్పెన్షన్ దాకా వెళ్లింది.. అంతా మంచే జరుగుతుందన్న రోజా..

లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో తన నియోజక వర్గంలోని నిరు పేద ప్రజలకే కాకుండా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు, పోలీసులకు స్వయంగా భోజనం సిద్దం చేసి తన ఔదార్యాన్ని, బాద్యతను చాటుకున్నారు రోజా. సరిగ్గా ఇదే సమయంలో తనకు అత్యంత సన్నిహితుడు, నగరి మున్సిపల్ కమీషనర్ వెంకట్రామి రెడ్డి పై వైసీపి ప్రభుత్వం వేటు వేసింది. ఇదే అంశంపై రోజా అతి సున్నితంగా స్పందించినట్తు తెలుస్తోంది. సీఎంగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూనే కమీషనర్ వెంకట్రామి రెడ్డి అంశంలో జరిగిన పొరపాట్లను తెలుకుంటారని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి సమర్థవంతమైన నాయకుడని, రాజకీయాల్లో జగన్ మోహన్ రెడ్డిని చూసి స్పూర్తి పొందుతానని అభివర్ణించిన రోజా వెంకట్రామి రెడ్డి అంశంలో తాను చేసేది ఏమీ లేదని చెప్పుకొచ్చారు.

  Young Farmer Throwing Out Food | అరటి ని కాలువ లో విసిరేస్తున్న రైతు
   జగన్ సమర్ధవంతమైన నాయకుడు.. కాని కొన్న అంశాల్లో వాస్తవాలు తెలుసుకోవాలన్న నగరి ఎమ్మెల్యే..

  జగన్ సమర్ధవంతమైన నాయకుడు.. కాని కొన్న అంశాల్లో వాస్తవాలు తెలుసుకోవాలన్న నగరి ఎమ్మెల్యే..

  కాగా నగరి మున్పిపల్ కమీషనర్ చేసిన వీడియోలో తప్పేంముందనే అభిప్రాయాన్ని రోజా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం అందించాల్సిన సౌలభ్యతల గురించి ప్రస్థావించే విధానంలో చిన్న పొరపాటు దొర్లిందని, అది సస్పెన్షన్ వంటి పెద్ద వేటు దాకా వెళ్లే అంశం కాదని మాత్రం రోజా అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. ప్రభుత్వం విధించిన కమిటీ ద్వారా త్వరలో నిజాలు వెలుగు చూస్తాయని, అప్పుడు సీఎం జగన్ ఆలోచనా విధానంలో మార్పు వస్తుందని రోజా ఆశాభావం వ్యక్తం చేసారు. అంతే కాకుండా త్వరలో జగన్ మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలుస్తాయని స్పష్టం చేసారు. కమీషనర్ వెంకట్రామి రెడ్డి తనకు సన్నిహితుడైనప్పటికి అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టబోనని, కాకపోతే వాస్తవాలు గ్రహించాలని మాత్రం జగన్ మోహన్ రెడ్డికి పరోక్షంగా సూచిస్తున్నారు రోజా. మొత్తానికి నగరి మున్సిపల్ కమీషనర్ అంశంలో నొప్పించక, తానొప్పక అనే సిద్దాంతంతో రోజా ముందుకు వెళ్తెన్నట్టు చర్చ జరుగుతోంది.

  English summary
  Nagari Muncipal Commissioner Venkat Rami Reddy has even though he is a close friend, he is not trying to save. He went on to say that the smallest item is misleading, and that it is painful to go for a vote unless it is appropriate to reprimand. CM Jagan Mohan Reddy will soon come to know the facts of the controversy, and Nagari MLA Roja expressed hope that all will be well.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X