వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు, ఊరుకునేది లేదు: రోజా, శ్రీరెడ్డికి దిమ్మతిరిగే షాక్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

'బట్టలూడదీసి మాట్లాడుకుందాం - బట్టలూడదూసి కొడదాం ' :ఆర్. కే. పై పవన్ విజ్రుమ్భాన

తిరుమల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర ఎమ్మెల్యే రోజా ఆదివారం నిప్పులు చెరిగారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వివాదాస్పదం కావడం బాధాకరమన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆయనను టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదన్నారు.

శ్రీరెడ్డి ఇష్యూ మలుపు: పోలీసులు చెప్పడంతోనే వెళ్లిపోయిన పవన్, రాధాకృష్ణ తర్వాత శ్రీనిరాజు సై!శ్రీరెడ్డి ఇష్యూ మలుపు: పోలీసులు చెప్పడంతోనే వెళ్లిపోయిన పవన్, రాధాకృష్ణ తర్వాత శ్రీనిరాజు సై!

ఆమె ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. టీటీడీ పాలక మండలి నియామకాల విషయంలో చంద్రబాబు హిందువుల మనోభావాలను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో విజయవాడలో హిందూ దేవాలయాలను కూలగొట్టారని, కాళహస్తీ, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో క్షుద్రపూజలు నిర్వహించారని, ఇప్పుడు టీటీడీలోకి అన్యమతస్తులను తెచ్చి పెడుతున్నారని, తద్వారా హిందువుల అవమానిస్తున్నారని రోజా మండిపడ్డారు.

హిందువులను గౌరవించడం నేర్చుకోవాలి

హిందువులను గౌరవించడం నేర్చుకోవాలి

హిందువులను గౌరవించడం చంద్రబాబు నేర్చుకోవాలని రోజా మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నియామకం సరికాదన్నారు. పాలక మండలి పైన వస్తున్న విమర్శలపై ప్రభుత్వం, చంద్రబాబు వెంటనే వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

 మాకు ఫిర్యాదు చేయండి

మాకు ఫిర్యాదు చేయండి

టాలీవుడ్ నుంచి కాస్టింగ్ కౌచ్ భూతాన్ని తరిమేసే పోరాటంలో బాధితులకు అండగా ఉండామని రోజా చెప్పారు. 1991 నుంచి తాను చిత్రపరిశ్రమలో ఉన్నానని, ఇప్పటిదాకా కాస్టింగ్ కౌచ్ పైన ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఇప్పుడు, ఇకపై ఎవరికైనా ఇబ్బందులు కలిగితే నేరుగా తనకు, జీవితకు, ఇతర సినీ పెద్దలకు ఫిర్యాదు చేయవచ్చునని, వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

పవన్ కళ్యాణ్‌ను అంటే ఊరుకునేది లేదు!

పవన్ కళ్యాణ్‌ను అంటే ఊరుకునేది లేదు!

కానీ వ్యక్తిగత లాభం కోసం కొందరు చిత్రపరిశ్రమలోని వారి పైననో, లేక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైననో ఇష్టం వచ్చినట్లు దూషణలకు దిగడం సరికాదని రోజా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నటి శ్రీరెడ్డిని ఉద్దేశించినట్లుగా ఉన్నాయి. ఇది ఆమెకు గట్టి కౌంటర్.

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో రాజకీయంగా విభేదిస్తాం కానీ

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో రాజకీయంగా విభేదిస్తాం కానీ

చిరంజీవి, పవన్ కళ్యాణ్ విషయంలో రాజకీయంగా తాము విభేదిస్తామని, కానీ వ్యక్తిగతంగా వారి కుటుంబాన్ని కించపరిచి వారిని హర్ట్ చేయడం మాత్రం సరికాదని రోజా అన్నారు. మహిళలపై బాలకృష్ణ మాటలపై సోకాల్డ్ నాయకులు, సోకాల్డ్ మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కొడుకుగా ఉన్న బాలకృష్ణ మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎందుకు నిలదీయడం లేదన్నారు. ఒకరి విషయంలో మాత్రం ఇండస్ట్రీని బద్నాం చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీలోని బాలకృష్ణను ప్రశ్నించకుండా పవన్‌ను నిలదీయడం ఏమిటన్నారు.

 పవన్‌ను చంద్రబాబు టార్గెట్ చేశారు, ఊరుకునేది లేదు

పవన్‌ను చంద్రబాబు టార్గెట్ చేశారు, ఊరుకునేది లేదు

చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారని రోజా వ్యాఖ్యానించారు. కొన్ని ఛానల్స్ పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు. పవన్, ఆయన కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. స్వలాభం కోసం సినీ పరిశ్రమలో కొందరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, పబ్లిసిటీ కోసం పరువు తీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాస్టింగ్ కౌచ్ పైన ఎవరికీ ఫిర్యాదు చేయకుండా ఏదో చెప్పడం సరికాదన్నారు.

English summary
YSR Congress Party MLA Roja said that she will support Jana Sena chief Pawan Kalyan, slams AP CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X