వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనిత కాళ్లు కడిగి రోజా సారీ చెప్పాలి: ఉమ, సస్పెన్షన్‌పై ఫుల్‌స్టాప్ పడదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనిత కాళ్లు కడిగి క్షమాపణ చెప్పాల్సిందేనని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. సస్పెన్షన్ విషయంలో సుప్రీం కోర్టులో రోజాకు చుక్కెదురైన విషయం తెలిసిందే.

అసెంబ్లీయే ఫైనల్, సారీ చెప్పు: సుప్రీంలో రోజాకు చుక్కెదురు, సభకూ సూచనఅసెంబ్లీయే ఫైనల్, సారీ చెప్పు: సుప్రీంలో రోజాకు చుక్కెదురు, సభకూ సూచన

దీనిపై బోండా ఉమ శుక్రవారం ఉదయం ఓ టీవీ ఛానల్లో స్పందించారు. దళిత, మహిళా ఎమ్మెల్యే అయిన అనిత పైన రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. దానికి ఆమె అనిత కాళ్లు కడిగి క్షమాపణ చెప్పాలన్నారు. రోజా కూడా తనను కోర్టు క్షమాపణ చెప్పమనలేదని, వివరణ ఇవ్వాలని కోరిందని తెలిపారు.

Roja should wash Anitha's feet: Bonda Uma

కాగా, రోజా వ్యవహారాన్ని పెద్దదిగా చేసుకోవద్దని, అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా క్షమాపణలు చెబుతూ స్పీకర్‌కు లేఖ రాయాలని, అలాగే ప్రభుత్వం కూడా ఆమె క్షమాపణను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. కొత్త రాష్ట్రమైన ఏపీలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, ఇలాంటి అంశాలకు ఫుల్‌స్టాప్ పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించారని అధికార, ప్రతిపక్ష పార్టీలకు న్యాయస్థానం హితవు పలికింది.

బాబుపై ద్వేషం లేదు: 'క్షమాపణ'పై రోజా మెలిక, వివాదం కొనసాగేనా?అయితే, రోజా, బోండా ఉమల వ్యాఖ్యలు చూస్తుంటే ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా కనిపించడం లేదు. నిన్న (గురువారం) రోజా మాట్లాడుతూ.. తనను కోర్టు క్షమాపణలు చెప్పాలని ఆదేశించలేదని, కేవలం వివరణ ఇవ్వాలని సూచించిందని తెలిపారు.

కొత్త రాష్ట్రంలో సమస్యలెన్నో, రోజా గోల ఏమిటి, ఇద్దరిదీ తప్పే: బాబుకు సుప్రీంకొత్త రాష్ట్రంలో సమస్యలెన్నో, రోజా గోల ఏమిటి, ఇద్దరిదీ తప్పే: బాబుకు సుప్రీం

అదే సమయంలో బోండా ఉమ ఈ రోజు మాట్లాడుతూ.. రోజా తమ ఎమ్మెల్యే అనిత కాళ్లు కడగాలని చెబుతున్నారు. క్షమాపణ చెప్పేందుకు రోజా సిద్ధంగా కనిపించడం లేదు. అదే విధంగా జరగలేని దానిని... అంటే కాళ్లు కడిగే విషయం జరగని పని. దాని కోసం టిడిపి నేత డిమాండ్ చేయడం గమనార్హం.

English summary
TDP MLA Bonda Uma deamdned that Roja should wash ANitha's feet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X