వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు-వెంకయ్య కలిసే: రోజా, జగన్ నిధుల కుట్ర: అనిత, సుజాత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్య, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇరువురు కలిసి ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా గురువారం నాడు నిప్పులు చెరిగారు. నాడు అడ్డదిడ్డంగా రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందన్నారు.

ఇప్పుడు రెండున్నరేళ్ల పాపను (ఏపీ) బీజేపీ, టీడీపీలు మోసం చేస్తున్నాయన్నారు. ఏపీకి హామీ ఇచ్చి బీజేపీ ఇప్పుడు గొంతు నులిమిందని ధ్వజమెత్తారు. హోదా వచ్చే వరకు తాము ఉద్యమిస్తామన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.

అసెంబ్లీ: 'జగన్! ఇదేం పద్ధతి, అందర్నీ సస్పెండ్ చేయండి', హక్కుంది కానీ.. టిడిపి నేతఅసెంబ్లీ: 'జగన్! ఇదేం పద్ధతి, అందర్నీ సస్పెండ్ చేయండి', హక్కుంది కానీ.. టిడిపి నేత

తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఎన్ని రకాలుగా ఒత్తిడి తేవాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అరుణ్ జైట్లీ ప్యాకేజీ ప్రకటనను చంద్రబాబు ఎలా స్వాగతిస్తారని నిలదీశారు. కేంద్రం ప్రకటన పైన బాబు తీరు సరికాదన్నారు. హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఇస్తామని కవరింగ్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు.

 Roja slams Chandrababu and Venkaiah over Special Status

ఎప్పుడు రావాలో జగన్‌కు తెలియదు: అనిత

ప్రత్యేక హోదా పైన వాయిదా తీర్మానం ఇచ్చిన జగన్‌కు సభకు ఎప్పుడు రావాలో కూడా తెలియదని, అలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం విచారకరమని టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. స్పీకర్ పైన వైసిపికి గౌరవం లేదని, అలాంటప్పుడు ప్రజల గురించి ఏం మాట్లాడుతారో చెప్పాలన్నారు.

వారు సంఘ విద్రోహ శక్తులు అని మండిపడ్డారు. తాము ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడటం లేదన్నారు. జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లారని, అక్కడకు ప్రత్యేక హోదా కోసం వెళ్లారా లేక చంద్రబాబును తిట్టేందుకు వెళ్లారా అని మండిపడ్డారు. తాము కచ్చితంగా హోదా సాధిస్తామన్నారు.

ఏపీ భగ్గు: తగ్గిన చంద్రబాబు, జగన్ 'బంద్'పై సొంత పార్టీలో అసంతృప్తిఏపీ భగ్గు: తగ్గిన చంద్రబాబు, జగన్ 'బంద్'పై సొంత పార్టీలో అసంతృప్తి

రాష్ట్రానికి హోదా రావొద్దనేదే జగన్ కుట్ర: పీతల సుజాత

ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు రావొద్దని జగన్, వైసిపి కుట్ర చేస్తుందని మంత్రి పీతల సుజత అన్నారు. అవన్నీ రాకుంటేనే ప్రజల గుండెల్లో చంద్రబాబు ఉండరని, అప్పుడు తమకు రాజకీయ లబ్ధి చేకూరుతుందని వైసిపి భావిస్తోందన్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లి హోదా కోసం ఎందుకు మాట్లాడలేదన్నారు. చంద్రబాబు నిత్యం అభివృద్ధి కోసం పాటు పడుతున్నారన్నారు. ఢిల్లీ వెళ్లి ఎప్పుడైనా హోదా గురించి అడిగారా అని ప్రశ్నించారు.

వెంకయ్యది నాడు ఉడుం పట్టు, నేడు ఊసరవెల్లి పట్టు: నారాయణ

ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడుది ఆ రోజు (విభజన సమయంలో) ఉడుం పట్టు అని, నేడు మాత్రం ఊసరవెల్లి పట్టు అని సిపిఐ నేత నారాయణ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అంశానికి తెరపడిందన్నారు. బీజేపీ ఏపీ ప్రజలను మోసగించిందన్నారు.

English summary
YSR Congress Party MLA Roja slams AP CM Chandrababu Naidu and Union Minister Venkaiah Naidu over Special Status
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X